Girls : ఆడపిల్లలు తొందరగా రజస్వల అవ్వడానికి కారణాలు మీకు తెలుసా?

ఇదివరికి రోజుల్లో ఆడపిల్లలు పదమూడేళ్లకు లేదా పద్నాలుగేళ్ళకు రజస్వల అయ్యేవారు. కానీ ఇప్పుడు పిల్లలు ఎనిమిది లేదా పది సంవత్సరాలకే రజస్వల అవుతున్నారు. దీని వలన వారికి....................

Kaburulu

Kaburulu Desk

February 28, 2023 | 07:19 PM

Girls : ఆడపిల్లలు తొందరగా రజస్వల అవ్వడానికి కారణాలు మీకు తెలుసా?

Girls :  ఇదివరికి రోజుల్లో ఆడపిల్లలు పదమూడేళ్లకు లేదా పద్నాలుగేళ్ళకు రజస్వల అయ్యేవారు. కానీ ఇప్పుడు పిల్లలు ఎనిమిది లేదా పది సంవత్సరాలకే రజస్వల అవుతున్నారు. దీని వలన వారికి మెనోపాజ్ దశ కూడా ముందుగానే వస్తుంది. అంటే హార్మోన్ల అసమతుల్యత, డిప్రెషన్, థైరాయిడ్ ముప్పు పెరుగుతాయి. ఈ విధంగా పిల్లలు చిన్న వయసులోనే యవ్వనం లోకి అడుగుపెట్టడం వలన చాలా రకాల ఇబ్బందులని ఎదుర్కుంటారు. అదేవిధంగా వారి తల్లితండ్రులు ఎంతో ఆందోళన చెందుతారు. అసలు ఈ విధంగా చిన్న వయసులోనే రజస్వల కావడానికి ముఖ్య కారణాలు ఏంటో తెలుసా?

ముఖ్యంగా ప్లాస్టిక్ బ్యాగులల్లో ప్యాకింగ్ చేసే ఆహారపదార్థాలు తినడం వలన వాటిలోని కెమికల్స్ అన్నీ మన శరీరంలోనికి చేరతాయి. ప్లాస్టిక్ లో ఉండే బినిఫినాల్, హానికర రసాయనాలు శరీరంలోనికి ప్రవేశించి ఆడపిల్లలలో ఈస్ట్రోజెన్, థైరాయిడ్ హార్మోన్ల అసమతుల్యతను ఏర్పడేలా చేస్తాయి. ఈ హార్మోన్లపై ప్రభావం చూపే వాటిని ఎండోక్రైన్ డిస్రెప్టార్స్ అంటారు. ఇది అమ్మాయిలలోనూ అబ్బాయిలలోను త్వరగా యుక్త వయసు రావడానికి కారణం అవుతున్నాయి. ఈ రసాయనాలు ప్లాస్టిక్ ఆహార ప్యాకేజీలలోను, షాంపూలు, లోషన్లు వంటి వాటి వలన కూడా మన పిల్లల శరీరంలోనికి ప్రవేశిస్తాయి.

Honey Benefits : తేనెని ఆహారంలో భాగం చేసుకోండి.. తేనే వలన కలిగే ప్రయోజనాలు మీకు తెలుసా?

పిల్లలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా స్మార్ట్ ఫోన్స్ కి అలవాటు పడుతున్నారు దీని వలన వారికి సరిపడా నిద్ర అనేది దూరం అవుతుంది. సరైన నిద్ర లేకపోయినా కూడా చిన్న వయసులోనే రజస్వల అవుతారు. ఇంకా ఎక్కువగా బరువు పెరిగిన పిల్లలు కూడా తొందరగా రజస్వల అవుతారు. పిల్లలు తమ వయసుకు తగ్గ బరువు కంటే ఎక్కువగా ఉంటే అది పిల్లలలో ఈస్ట్రోజెన్ స్థాయిలను పెంచి తొందరగా రజస్వల అవ్వడానికి కారణం అవుతుంది. కాబట్టి పిల్లలకు ఎక్సర్ సైజ్ లు చేయించి అధిక బరువు ఉంటే తగ్గించవచ్చు.