Telangana Budget 2023: అసెంబ్లీలో ప్రవేశపెట్టిన మంత్రి హరీష్ రావు.. ఏ శాఖకి ఎన్ని కోట్లంటే?

Telangana Budget 2023: 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తెలంగాణ వార్షిక బడ్జెట్‌ను మంత్రి హరీశ్ రావు శాసనసభలో ప్రవేశపెట్టారు. రూ.2,90,396 కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రతిపాదించగా.. రెవెన్యూ వ్యయం రూ.2,11,685 కోట్లుగా.. పెట్టుబడి వ్యయం రూ.37,525 కోట్లుగా పేర్కొన్నారు. శాసనసభలో హరీశ్ రావు, శాసన మండలిలో శాసనసభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బడ్జెట్ ప్రవేశ పెట్టారు. తొలిసారిగా సభ్యులందరికీ పెన్ డ్రైవ్‌ల ద్వారా బడ్జెట్ కాపీలను అందించారు.
ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు ఉండటం, టీఆర్‌ఎస్ నుంచి బీఆర్‌ఎస్‌గా మారిన అధికార పార్టీ జాతీయ రాజకీయాల్లో ప్రభావం చూసే దిశగా అడుగులు వేయడం తదితర పరిణామాల నేపథ్యంలో ఈ బడ్జెట్‌కు ప్రాధాన్యం సంతరించుకుంది. గత ఏడాది మార్చి 7న రూ.2.71 లక్షల కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టగా.. ఇప్పుడది రూ.2,90,396 కోట్లకి పెరిగింది.
ఏ రంగానికి ఎన్ని కోట్ల కేటాయింపులు?
-ప్రజా పంపిణీ వ్యవస్థకు రూ. 3,117 కోట్లు
-రుణమాఫీ పథకం కోసం రూ. 6385 కోట్లు
-ఆయిల్ పామ్ సాగుకు రూ.1000 కోట్లు
-కేసీఆర్ న్యూట్రీషన్ కిట్ కోసం రూ.200 కోట్లు
-విద్యుత్ రంగానికి రూ. 12,727 కోట్లు
-కొత్తగా నియమించబడే ఉద్యోగుల జీతభత్యాల కోసం రూ.1000 కోట్లు
-డబుల్ బెడ్రూం ఇండ్ల పథకానికి రూ.12,000 కోట్లు
-ఆరోగ్య శ్రీ పథకానికి రూ. 1463 కోట్లు
-ప్రణాళిక విభాగానికి రూ. 11,495 కోట్లు
-ఐటీ, కమ్యూనికేషన్ల శాఖకు రూ. 366 కోట్లు
– మహిళా, శిశు సంక్షేమం కోసం రూ. 2,131 కోట్లు
– ఎస్సీ ప్రత్యేక నిధి రూ. 36,750 కోట్లు
– ఎస్టీ ప్రత్యేక నిధి రూ. 15,233 కోట్లు
– విద్యా రంగానికి రూ. 19,093 కోట్లు
– వైద్య రంగానికి రూ. 12,161 కోట్లు
– అటవీ శాఖకు రూ. 1,471 కోట్లు
– దళిత బంధు పథకానికి రూ.17,700 కోట్లు
– బీసీ సంక్షేమం కోసం రూ. 6,229 కోట్లు
– వ్యవసాయ రంగానికి రూ. 26,831 కోట్లు
– నీటి పారుదల శాఖకు రూ. 26,885 కోట్లు
– విద్యుత్ రంగానికి కేటాయింపులు రూ. 12,727 కోట్లు
-తెలంగాణ హరితహారం 1,471 కోట్లు
-పెట్టుబడి వ్యయం రూ. 37,525 కోట్లు
-పల్లె ప్రగతి, పంచాయతీ రాజ్ శాఖకు రూ.31,426 కోట్లు
-పురపాలక శాఖకు రూ.11, 372 కోట్లు
-రైతు బంధు – రూ.1575 కోట్లు
-రైతు భీమా – రూ.1589 కోట్లు
-కల్యా ణలక్ష్మి రూ. 2000 కోట్లు
-బియ్యం సబ్సిడీ రూ. 2000 కోట్లు
-అసర పెన్షన్లు రూ. 12000 కోట్లు
-పురపాలక శాఖకు రూ.11,372 కోట్లు
-రోడ్లు భవనాలకు రూ.2,500 కోట్లు
-పరిశ్రమల శాఖకు రూ.4, 037 కోట్లు
-హోమ్ శాఖకు రూ.9,599 కోట్లు
-బీసీ సం క్షేమం కోసం రూ. 6,229 కోట్లు
-మహిళా, శిశు సం క్షేమం కోసం రూ. 2,131 కోట్లు
-ఎస్సీ ప్రత్యేక నిధి కోసం రూ. 36,750 కోట్లు
-మైనార్టీ సంక్షేమం కోసం రూ. 2,200 కోట్లు
-గిరిజన సంక్షేమం, ప్రత్యేక ప్రగతి నిధికి రూ. 15,223 కోట్లు