Healthy Food for Heart : గుండెకు మంచి చేసే ఆహార పదార్థాలు ఏంటో తెలుసా.. ఇవి కచ్చితంగా తినండి..

మన అందరం అన్ని రకాల ఫుడ్స్ ని తింటూ ఉంటాము. కానీ డయాబెటిస్, గుండె జబ్బులు, కొలెస్ట్రాల్ వంటివి రాగానే ఆహార పదార్థాల్లో చాలా మార్చుకుంటారు. అలాంటప్పుడు చప్పటి తిండి తినాల్సి వస్తుంది. ఆహారాన్ని కూడా జాగ్రత్తగా తీసుకోవాల్సి వస్తుంది...................

Kaburulu

Kaburulu Desk

February 6, 2023 | 09:21 AM

Healthy Food for Heart : గుండెకు మంచి చేసే ఆహార పదార్థాలు ఏంటో తెలుసా.. ఇవి కచ్చితంగా తినండి..

Healthy Food for Heart :  మన అందరం అన్ని రకాల ఫుడ్స్ ని తింటూ ఉంటాము. కానీ డయాబెటిస్, గుండె జబ్బులు, కొలెస్ట్రాల్ వంటివి రాగానే ఆహార పదార్థాల్లో చాలా మార్చుకుంటారు. అలాంటప్పుడు చప్పటి తిండి తినాల్సి వస్తుంది. ఆహారాన్ని కూడా జాగ్రత్తగా తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి అలా కాకుండా కొన్ని ఆహార పదార్థాలను తినడం వలన నోటికి మంచి రుచి ఇవ్వడంతో పాటు మన ఆరోగ్యాన్ని మెరుగుపరిచేలా చేస్తుంది. ఈ ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల గుండెకు కూడా చాలా మంచిది.

Foods that reduce stress : ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నారా?? ఈ ఆహారపదార్థాలు తినండి.. ఒత్తిడిని తగ్గించుకోండి..

*ఆకుకూరలు.. అన్ని రకాల ఆకుకూరలతో పప్పు, పచ్చడి చేసుకొని తినవచ్చు. అవి మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి మరియు నోటికి రుచికరంగా ఉంటాయి.
*టమాటతో పచ్చడి, పప్పు, కూరలు వండుకోవచ్చు. టమాటలో ఉండే లైకోపీన్ అనే పోషకం మన గుండెకు చాలా మంచిది. ఇంకా టమాటా తినడం వలన ఇది మన నోటికి పుల్లగా, తియ్యగా కూడా ఉంటుంది.
*స్ట్రాబెర్రీ, బ్లూ బెర్రీ ఇవి తినడం వలన మన శరీరంలోని రక్తనాళాలను వెడల్పు చేసి గుండెపోటు రాకుండా చేస్తుంది.
*కిస్మిస్, బాదం, ఎండు ఖర్జూరం వంటివి రోజూ ఒక గుప్పెడు తినడం వలన మన గుండెకు ఎంతో మేలు జరుగుతుంది.
*ద్రాక్ష పండ్లను విడిగా తినాలి. జ్యూస్ తాగవద్దు. ద్రాక్ష పండ్లు మన గుండెకు శక్తిని ఇస్తాయి.
*డార్క్ చాకోలెట్లను రోజూ మితంగా తినడం వలన మన శరీరంలో రక్తం గడ్డకట్టకుండా ఉంటుంది ఇంకా రక్తపోటు కూడా తగ్గుతుంది.
*వేరుశనగ పప్పులు తినడం వలన కూడా మనకు వచ్చే గుండె జబ్బులు తగ్గుతాయి. ఇవి మన గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.
*నారింజలో ఉండే ఎలక్ట్రోలైట్లు గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో తోడ్పడుతుంది.
*అవకాడోను రోజూ తినడం వలన మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది.
*ఓట్స్ రక్తంలో ఉండే కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రిస్తుంది. ఇది రోజూ తినడం వలన మన గుండెకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది. కాబట్టి ఇలాంటి మంచి ఫుడ్స్ ని తీసుకొని ఆరోగ్యంగా ఉంటూ మీ గుండెని కాపాడుకోండి.