Foods that reduce stress : ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నారా?? ఈ ఆహారపదార్థాలు తినండి.. ఒత్తిడిని తగ్గించుకోండి..

ఈ రోజుల్లో అందరిదీ ఉరుకుల పరుగుల జీవితం అని మనకు తెలుసు. ఇలాంటి జీవితంలో అందరూ కూడా ఏదో ఒక సమయంలో ఒత్తిడికి గురవుతుంటారు. అయితే ఒత్తిడికి ఎక్కువగా గురవడం వలన మనకు బీపీ, డయాబెటిస్, అధిక బరువు, అకాల మరణం సంభవించే అవకాశం ఉంది. అందుకే ఒత్తిడిని తగ్గించుకోవడానికి..............

Kaburulu

Kaburulu Desk

February 5, 2023 | 11:00 AM

Foods that reduce stress : ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నారా?? ఈ ఆహారపదార్థాలు తినండి.. ఒత్తిడిని తగ్గించుకోండి..

Foods that reduce stress :  ఈ రోజుల్లో అందరిదీ ఉరుకుల పరుగుల జీవితం అని మనకు తెలుసు. ఇలాంటి జీవితంలో అందరూ కూడా ఏదో ఒక సమయంలో ఒత్తిడికి గురవుతుంటారు. అయితే ఒత్తిడికి ఎక్కువగా గురవడం వలన మనకు బీపీ, డయాబెటిస్, అధిక బరువు, అకాల మరణం సంభవించే అవకాశం ఉంది. అందుకే ఒత్తిడిని తగ్గించుకోవడానికి మనం యోగ, ధ్యానం వంటివి చేయవచ్చు. కానీ కొంతమందికి అవి కూడా చేసే టైం ఉండదు. అలాంటి వారు తినే ఆహారంలో కొన్ని ఆహార పదార్థాలని చేర్చుకోవడం వలన ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.

సిట్రస్ టైపు పండ్లను తినడం వలన మన శరీరంలో రోగ నిరోధకశక్తి పెరుగుతుంది. ఇది మనకు ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. ఆరెంజెస్, నిమ్మకాయ, స్ట్రాబెర్రీ, ఉసిరికాయ.. ఇవన్నీ సిట్రస్ పండ్ల కిందకు వస్తాయి. వీటిని మన ఆహారంలో భాగంగా చేసుకోవడం వలన ఒత్తిడి తగ్గుతుంది.

పాలకూర తినడం వలన ఇది మన శరీరం లో ఒత్తిడిని తగ్గిస్తుంది. ఆందోళన వలన వచ్చే బీపీని కూడా కంట్రోల్లో ఉంచుతుంది.

అరటిపండ్లు తినడం వలన మన శరీరంలో సెరోటోనిన్ అనే హార్మోన్ విడుదల అవుతుంది. ఇది మన ఆరోగ్య స్థితిని మెరుగుపరుస్తుంది. మెదడును ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.

బ్లూ బెర్రీస్ లో ఉండే విటమిన్ సి మన శరీరానికి యాంటి ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. ఇది మన శరీరంలో ఒత్తిడిని, ఆందోళనను తగ్గించడానికి ఉపయోగపడుతుంది.

అవకాడోలో ఉండే పొటాషియం, లుటీన్ మన శరీరంలో ఒత్తిడిని, ఆందోళనలను తగ్గిస్తాయి.

డార్క్ చాకోలెట్స్ ను తినడం వలన ఇవి మన శరీరంలో ఒత్తిడిని తగ్గించే ఎండార్ఫిన్ ను ఉత్పత్తి చేస్తాయి.

పాలు రోజూ తాగడం వలన ఒత్తిడిని తగ్గిస్తాయి. మనకు బీపీ లాంటివి తగ్గించడానికి ఉపయోగపడుతుంది.

Protein Food : శాకాహారులు మాంసాహారంలోని ప్రోటీన్స్ కోసం ఎలాంటి ఆహరం తినాలో తెలుసా??

గ్రీన్ టీ తాగడం వలన కూడా మన శరీరంలో ఒత్తిడి అనేది తగ్గుతుంది. కాబట్టి మనలోని ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఇలాంటి ఆహార పదార్థాలను మన డైట్ లో చేర్చుకొని ఒత్తిడిని దూరంగా ఉంచాలి.