Dental Sensitivity : దంతాలలో సెన్సిటివిటీ తగ్గాలంటే ఏం చేయాలో తెలుసా?

పళ్ళు జివ్వుమనడం అనేది చాలా మందికి ఉంటుంది. అయితే చలికాలంలోనే కాదు ఎండాకాలంలో కూడా మనం తినే ఆహార పదార్థాలను బట్టి దంతాలు జివ్వుమంటాయి. ఎండాకాలంలో ఐస్ క్రీంలు, కూల్ డ్రింక్స్ వంటివి తాగినా దంతాలు సెన్సిటివిటీకి గురవుతుంటాయి...................

Kaburulu

Kaburulu Desk

March 31, 2023 | 07:30 PM

Dental Sensitivity : దంతాలలో సెన్సిటివిటీ తగ్గాలంటే ఏం చేయాలో తెలుసా?

Dental Sensitivity :  పళ్ళు జివ్వుమనడం అనేది చాలా మందికి ఉంటుంది. అయితే చలికాలంలోనే కాదు ఎండాకాలంలో కూడా మనం తినే ఆహార పదార్థాలను బట్టి దంతాలు జివ్వుమంటాయి. ఎండాకాలంలో ఐస్ క్రీంలు, కూల్ డ్రింక్స్ వంటివి తాగినా దంతాలు సెన్సిటివిటీకి గురవుతుంటాయి.

సెన్సిటివిటీ తగ్గడానికి ఒక గ్లాసు వేడి నీటిలో కొద్దిగా ఉప్పు వేసి నోరు పుక్కిలించాలి. ఇలా రోజుకు రెండు సార్లు చేయడం వలన దంతాల సెన్సిటివిటీ తగ్గుతుంది.

తేనెలో యాంటి బ్యాక్టీరియా, యాంటి సెప్టిక్ లక్షణాలు ఉంటాయి. ఇది మన దంతాలకు వచ్చే సమస్యలను, పంటి నొప్పి, పళ్ళ సెన్సిటివిటీ వంటివి తగ్గిస్తుంది. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ తేనెను కలుపుకొని ఆ నీటిని పుక్కిలించాలి. ఇలా చేయడం వలన పళ్ళు జివ్వుమనడం తగ్గుతుంది.

ఒక స్పూన్ పసుపు, అర స్పూన్ ఉప్పు, అర స్పూన్ ఆవాల నూనె వేసి పేస్ట్ లా చేసుకోవాలి. ఆ పేస్ట్ ని దంతాలు నొప్పిగా అనిపించిన చోట, దంతాలు జివ్వుమనే చోట రాసుకోవాలి.

గ్రీన్ టీ తాగడం మన ఆరోగ్యానికి మంచిది. అలాగే దంతాలు సెన్సిటివిటీ తగ్గడానికి గ్రీన్ టీని నోటిలో వేసుకొని రోజుకు రెండు సార్లు పుక్కిలించాలి. ఇలా చేయడం వలన దంతాలు జివ్వుమనడం తగ్గుతుంది.

Lips Cracking : ఎండాకాలంలో పెదాలు పొడిబారుతున్నాయా.. అయితే ఈ చిట్కాలు పాటించండి..

కొన్ని చుక్కల వెనీలా ఎసెన్స్ లో కాటన్ బాల్ ను నానబెట్టాలి. దానిని ఆ తరువాత దంతాలపై ఉంచుకోవాలి. ఇలా చేసినా దంతాలు జివ్వుమనడం తగ్గుతుంది.

ఫ్లోరైడ్ టూత్ పేస్ట్ తో రోజుకు రెండు సార్లు బ్రష్ చేసుకుంటే దంతాలు సెన్సిటివిటీ తగ్గుతుంది. దంతాలు బ్రష్ చేసుకునేటప్పుడు గట్టిగా రుద్దుకోకూడదు. ఎందుకంటే గట్టిగా బ్రష్ చేసుకుంటే దంతాలపైన ఉన్న ఎనామిల్ పోయి దంతాలు సెన్సిటివిటీగా మారతాయి.

స్మోకింగ్, డ్రింకింగ్ హ్యాబిట్స్ ఉన్నవారికి దంతాలు సెన్సిటివిటీ దెబ్బతింటుంది. రోజుకు ఒకసారి మౌత్ ఫ్రెష్నర్ తో పుక్కిలించుకోవాలి. ఈ విధంగా మనం మన దంతాల సెన్సిటివిటీ తగ్గించుకొని దంతాలని కాపాడుకోవచ్చు.