Honey Benefits : తేనెని ఆహారంలో భాగం చేసుకోండి.. తేనే వలన కలిగే ప్రయోజనాలు మీకు తెలుసా?

పాతకాలంలో తేనె అనేది మన అందరి ఇళ్లల్లో ప్రతి దానిలో వాడుతుంటారు. కానీ ఇప్పుడు అందరూ అన్నిటిలో వాడడం లేదు. కానీ తేనెను ఆహారంలో భాగంగా తీసుకోవడం వలన అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి. తేనెలో అన్ని రకాల విటమిన్స్, మినరల్స్, యాంటి ఆక్సిడెంట్స్.................

Kaburulu

Kaburulu Desk

February 28, 2023 | 03:33 PM

Honey Benefits : తేనెని ఆహారంలో భాగం చేసుకోండి.. తేనే వలన కలిగే ప్రయోజనాలు మీకు తెలుసా?

Honey Benefits :  పాతకాలంలో తేనె అనేది మన అందరి ఇళ్లల్లో ప్రతి దానిలో వాడుతుంటారు. కానీ ఇప్పుడు అందరూ అన్నిటిలో వాడడం లేదు. కానీ తేనెను ఆహారంలో భాగంగా తీసుకోవడం వలన అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి. తేనెలో అన్ని రకాల విటమిన్స్, మినరల్స్, యాంటి ఆక్సిడెంట్స్ ఉన్నాయి. తేనెను చక్కెరకు బదులుగా మనం తీసుకునే ఆహారపదార్థాలలో వాడుకోవచ్చు. దీని వలన మన శరీరానికి తక్కువ క్యాలరీలు అందుతాయి. ఇంకా మనం బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది.

తేనే సహజసిద్ధంగా ప్రకృతి నుంచి దొరికేది కాబట్టి చక్కెరలో కంటే తేనెలో క్యాలరీలు తక్కువ ఉంటాయి. విటమిన్స్ ఎక్కువ ఉంటాయి. మనం తాగే టీ, కాఫీ ఇంకా మనం వండుకునే స్వీట్స్ లో కూడా చక్కరని బదులు తేనెను వేసి తయారుచేయవచ్చు. తేనెను గోరువెచ్చని గ్రీన్ టీతో తీసుకోవడం వలన బరువు తగ్గుతారు. ఇంకా తేనెను పరకడుపున తీసుకోవడం వలన అది మన ఆకలిని కంట్రోల్ చేస్తుంది. పరకడుపున గోరువెచ్చని నీటితో తేనెను తీసుకోవడం వలన అది మన జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

తేనె మన శరీరంలో శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. తేనెను మనం ఎక్సర్ సైజ్ లు చేసేటప్పుడు తీసుకోవడం వలన మనకు శక్తి వచ్చి ఇంకా ఎక్కువ సమయం వర్క్ ఔట్స్ చేయవచ్చు. మన శరీరంలో క్యాలరీలు త్వరగా కరగాలి అంటే పరకడుపున మరియు మనం తిన్న తరువాత తేనెను తీసుకోవాలి. డయాబెటిస్ ఉన్నవారు కూడా తేనెను ఆహార పదార్థాలలో భాగంగా తినవచ్చు. ఎందుకంటే తేనెలో గ్లూకోజ్ శాతం తక్కువగా ఉంటుంది. కాబట్టి షుగర్ ఉన్నవారు కూడా తేనెను తినవచ్చు..

Eye Issues : ముప్ఫయ్ ఏళ్లకే కంటి సమస్యలు వస్తున్నాయా? ఇలా చేయండి..

మనకు జలుబు, దగ్గు వచ్చినప్పుడు కొద్దిగా తేనెను తినవచ్చు. అది మనలోని శ్లేష్మాన్ని హరించి దగ్గును తగ్గేలా చేస్తుంది. తేనెను తినడం వలన మనకు రక్తహీనత సమస్య ఉన్న అది తగ్గుతుంది. ఈ విధంగా మనం తేనెను ఆహారంలో భాగంగా ఉపయోగించుకొని మన ఆరోగ్య సమస్యల(జలుబు, దగ్గు, డయాబెటిస్, రక్తహీనత)ను తగ్గించుకోవచ్చు.