Itching Rashes : దురద, దద్దుర్లు ఎక్కువగా వస్తున్నాయా? ఈ చిట్కాలు పాటించండి..

కొంతమందికి ఫుడ్ ఎలర్జీ ల వలన కూడా దద్దుర్లు, దురదలు వస్తాయి. లేదా డస్ట్ ఎలర్జీ, ఏవైనా దోమలు, పురుగులు కుట్టినప్పుడు వస్తూ ఉంటాయి. అయితే అవి తగ్గడానికి...................

Kaburulu

Kaburulu Desk

March 3, 2023 | 05:50 PM

Itching Rashes : దురద, దద్దుర్లు ఎక్కువగా వస్తున్నాయా? ఈ చిట్కాలు పాటించండి..

Itching Rashes :  దురద, దద్దుర్లు అనేవి మనకు ఏమైనా గాయాలు అయినప్పుడు అవి తగ్గిన తరువాత ఎక్కువగా వస్తుంటాయి. కొంతమందికి ఫుడ్ ఎలర్జీ ల వలన కూడా దద్దుర్లు, దురదలు వస్తాయి. లేదా డస్ట్ ఎలర్జీ, ఏవైనా దోమలు, పురుగులు కుట్టినప్పుడు వస్తూ ఉంటాయి. అయితే అవి తగ్గడానికి టాబ్లెట్స్, రకరకాల మందులు, టానిక్ లు వాడుతుంటారు. కానీ మనం ఇంటిలో ఉండే పదార్థాలను ఉపయోగించి కొన్ని చిట్కాల ద్వారా దురదలు, దద్దుర్లను తగ్గించుకోవచ్చు.

*తేనెలో క్రిములను నాశనం చేసే గుణాలు ఉన్నాయి. కావున రెండు స్పూన్ల తేనెకు కొద్దిగా నీటిని కలిపి దద్దుర్లు ఉన్నచోట రాయాలి. ఆరిన తరువాత చల్లని నీటితో కడగాలి.
*మనం పూజకు ఉపయోగించే కర్పూరంలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. దానిని పొడి చేసి దురదలు, దద్దుర్లు ఉన్న చోట రాసినా మంచి ఫలితం ఉంటుంది.
*కొబ్బరి నూనెలో ఉండే ఖనిజ లవణాలు కూడా దురదలు, దద్దుర్లను తగ్గిస్తుంది. కొబ్బరినూనెను కొద్దిగా వేడి చేయాలి. గోరువెచ్చని కొబ్బరినూనెను దురదలు, దద్దుర్లు ఉన్నచోట రాయవచ్చు
*కొబ్బరినూనెలో కర్పూరం పొడిని కలిపి కూడా రాయవచ్చు. అప్పుడు మంచి ఫలితం ఉంటుంది.
*కొత్తిమీర ఆకులను గ్రైండ్ చేసి దానిలో కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి ఆ పేస్ట్ ని దురదలు, దద్దుర్లు ఉన్న చోట అప్లై చేస్తే తగ్గుతాయి.
*అలోవెరా జెల్ ను డైరెక్ట్ గా రాయడం వలన కూడా దురదలు, దద్దుర్లు తగ్గుతాయి.
*ఒక కప్పు గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్ ను కలిపి దానిని దూదితో దురదలు, దద్దుర్లు ఉన్న చోట రాస్తే తగ్గుతాయి.
*ఒక స్పూన్ బేకింగ్ సోడాలో కొద్దిగా నీటిని కలపాలి. ఆ పేస్ట్ ని దురదలు, దద్దుర్లు ఉన్న చోట రాసినా తగ్గుతాయి.
*చింతపండు, నల్ల జీలకర్రను మెత్తగా నూరి ఆ పేస్ట్ ని దురదలు, దద్దుర్లు ఉన్న చోట రాయాలి.