Best Food : పరీక్షల సమయంలో పిల్లలలో ఒత్తిడిని తగ్గించడానికి ఎలాంటి ఆహారం ఇవ్వాలి??

సమ్మర్ మొదలైందంటేనే పిల్లలందరికీ పరీక్షలు. ఆల్రెడీ కొంతమందికి పరీక్షలు జరుగుతుండగా మరికొంతమందికి త్వరలో మొదలు కానున్నాయి. అయితే పరీక్షలు రాగానే పిల్లలకు ఒత్తిడి...............

Kaburulu

Kaburulu Desk

March 28, 2023 | 04:17 PM

Best Food : పరీక్షల సమయంలో పిల్లలలో ఒత్తిడిని తగ్గించడానికి ఎలాంటి ఆహారం ఇవ్వాలి??

Best Food :  సమ్మర్ మొదలైందంటేనే పిల్లలందరికీ పరీక్షలు. ఆల్రెడీ కొంతమందికి పరీక్షలు జరుగుతుండగా మరికొంతమందికి త్వరలో మొదలు కానున్నాయి. అయితే పరీక్షలు రాగానే పిల్లలకు ఒత్తిడి అనేది వారికి తెలియకుండానే వస్తుంది. కాబట్టి మనం మన పిల్లలు ఒత్తిడికి గురవకుండా ఉండడానికి సరైన ఆహారాన్ని ఇవ్వాలి. ఎలాంటి ఆహార పదార్థాలు తినడం వలన పిల్లలు ఒత్తిడికి గురవకుండా ఉంటారో తెలుసుకోవాలి. ఆ ఆహారపదార్థాలను మనం మన పిల్లలకు పరీక్షల సమయంలో ఇవ్వాలి.

విటమిన్లు ఎ, సి, ఇ మరియు యాంటి ఆక్సిడెంట్లు ఉన్న ఆహారం తినడం వలన పిల్లలకు ఒత్తిడి తగ్గుతుంది. గుడ్లు, గుమ్మడి ఆకులు, క్యారెట్లు, సాల్మాన్ చేపలు, ఆకుకూరలు, తాజా పండ్లు వంటి వాటిలో ఈ మూలకాలు ఎక్కువగా ఉంటాయి. విటమిన్ బి కాంప్లెక్స్, జింక్, విటమిన్ సి అధికంగా ఉన్న ఆహార పదార్థాలు తినడం వలన పిల్లలలో ఒత్తిడి తగ్గుతుంది. గుడ్లు, పండ్లు, బాదం, అటుకులలో ఎక్కువగా ఈ మూలకాలు ఉంటాయి.

పిల్లలు పరీక్షల సమయంలో ఎక్కువగా చదువుకోవడానికి సమయాన్ని కేటాయించి నిద్రకు సరైన సమయాన్ని ఇవ్వరు. మనం కూడా పిల్లలు ఎక్కువసేపు మెలకువతో ఉండాలని కెఫీన్ ఉన్న పదార్థాలు కాఫీ, టీ లు వంటివి ఇస్తూ ఉంటాము. కానీ ఇవి పిల్లలకు ఇవ్వడం అంత మంచిది కాదు. పిల్లలకు నిద్ర లేమి రాకుండా చూసుకోవాలి. పరీక్షల సమయంలో పిల్లలు సరైన సమయానికి భోజనం తినేలా చూసుకోవాలి.

AC : ఎండాకాలంలో AC బిల్ ఎక్కువగా రాకుండా ఉండడానికి ఈ టిప్స్ ఫాలో అవ్వండి..

అన్నింటికంటే ముఖ్యంగా పిల్లలు తగినంత నీరు తాగేలా చూడాలి. లేకపోతే పిల్లలకు అనారోగ్యకరమైన సమస్యలు కలుగుతాయి. రాత్రి పూట నిద్రలేమిగా ఉండి పిల్లలు చదవడం మంచిది కాదు ఇలా చేయడం వలన పిల్లలు చదివింది ఎక్కువగా జ్ఞాపకం ఉండదు. కాబట్టి ఉదయాన్నే లేచి చదివితే పిల్లలకు ఎక్కువగా జ్ఞాపకం ఉంటుంది. ఒత్తిడికి గురవకుండా ఉంటారు. పరీక్షల సమయంలో డ్రై ఫ్రూట్స్ తినడం వలన పిల్లలకు కావలసిన పోషకాలు అందుతాయి. కాబట్టి పిల్లలకు పరీక్షల సమయంలో ఒత్తిడి గురవకుండా సరైన ఆహార పదార్థాలు ఇవ్వాలి.