Eye Issues : ముప్ఫయ్ ఏళ్లకే కంటి సమస్యలు వస్తున్నాయా? ఇలా చేయండి..
ఈ రోజుల్లో అందరూ స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు, ల్యాప్‌టాప్ లు వాడుతున్నారు. దీని వలన చాలా తక్కువ వయసులోనే కంటికి సంబంధించిన సమస్యలు వస్తున్నాయి. అందరూ వర్క్ పరంగా ఎక్కువ సమయాన్ని....................

Eye Issues : ఈ రోజుల్లో అందరూ స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు, ల్యాప్‌టాప్ లు వాడుతున్నారు. దీని వలన చాలా తక్కువ వయసులోనే కంటికి సంబంధించిన సమస్యలు వస్తున్నాయి. అందరూ వర్క్ పరంగా ఎక్కువ సమయాన్ని కంప్యూటర్ లకు, ల్యాప్‌టాప్ లకు కేటాయిస్తున్నారు. అంతేకాకుండా రాత్రి సమయంలో స్మార్ట్ ఫోన్స్ ను చీకటిలో కూడా వాడుతున్నారు. ఈ విధంగా చీకటిలో ఫోన్ ఎక్కువగా వాడడం వలన చూపు మందగించడం, కంటికి సంబంధించిన సమస్యలు వస్తాయి.
ల్యాప్‌టాప్ లు, కంప్యూటర్ లు ఎక్కువగా వాడడం వలన కళ్ళల్లో నొప్పి, కళ్ళు ఉబ్బడం వంటివి జరుగుతాయి. ఎక్కువసేపు ల్యాప్‌ట్యాప్ లు, కంప్యూటర్ లు వాడడం వలన కళ్ళు పొడిబారడం జరుగుతాయి. ఇంకా కళ్ళల్లో దురదలు, కళ్ళల్లో మంట, కళ్ళల్లో మైగ్రేన్, కంటి చూపు మందగించడం వంటివి కూడా వచ్చే అవకాశం ఉంది. ల్యాప్ ట్యాప్ లు, కంప్యూటర్ లు ఎక్కువగా ఉపయోగించడం వలన వారు కళ్ళను బ్లింక్ చేయడానికి కూడా ఎక్కువ సమయం తీసుకుంటూ ఉంటారు. కాబట్టి వర్క్ లేనప్పుడు లేదా వర్క్ చేస్తున్న సమయంలో కొంచెం సేపు బ్రేక్ తీసుకోవడం మంచిది. అప్పుడు కంటికి రిలాక్స్ దొరుకుతుంది.
Children Savings : పిల్లలకు డబ్బు విలువలు తెలిసేలా ఇలా చేయండి..
వర్క్ చేస్తున్నప్పుడు ఇరవై నిముషాలకు ఒకసారి బ్రేక్ తీసుకోవాలి. ఇలా చేయడం వలన మనకు వచ్చే కంటికి సంబంధించిన సమస్యలు కొద్దివరకైనా తగ్గుతాయి. ఇంకా మనం ఎప్పుడూ స్క్రీన్ పైనే వర్క్ చేయాలి అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా బ్లూ కట్ లెన్సులు ఉన్న అద్దాలను, లైట్ నుంచి కాపాడే అద్దాలను స్క్రీన్ వర్క్ చేసేటప్పుడు పెట్టుకోవాలి. ఈ విధంగా చేయడం వలన మనం కంటికి సంబంధించిన సమస్యలు రాకుండా ఉండేలా చేసుకోవచ్చు. కళ్ళకి చల్లగా ఉండేలా అప్పుడప్పుడు పేస్ వాష్ చేసుకుంటూ ఉండండి. రాత్రి పూట నిద్ర రాకపోయినా కళ్ళు మూసుకొని ఉండండి. అప్పుడప్పుడు కంటి మీద ఆలు, టమాటా, కీరదోస ముక్కలని గుండ్రంగా కోసుకొని పెట్టుకోండి. వీటివల్ల కొద్దిగా కంటి సమస్యలని తగ్గించొచ్చు.