CM Jagan: సీఎం పల్లె నిద్ర.. ఉగాది నుండి వారంలో మూడు రోజులు గ్రామాలలోకి జగన్!

CM Jagan: కోట దాటి బయటకి రావడం లేదు.. తాడేపల్లి ప్యాలెస్ దాటి సీఎం బయటకి రావడం లేదు. తాడేపల్లి నుండి గన్నవరం విమానాశ్రయానికి కూడా భారీ బందోబస్తు మధ్య.. ప్రజలను రోడ్డు మీదకి కూడా రానివ్వకుండా పరదాలు, బారికేడ్లు అడ్డంపెట్టుకొని వెళ్తున్నారని.. ప్రతిపక్ష పార్టీల నేతలు విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీనికి చెక్ పెట్టేందుకు సీఎం జగన్ పల్లె నిద్ర పేరిట ఓ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారట.
పల్లె నిద్ర కార్యమానికి జగన్ సంకేతాలు ఇచ్చారట. సీఎం జగన్ ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమం జరగనుందట. తెలుగు కొత్త సంవత్సరం ఉగాది నుంచి ప్రతివారం మూడు రోజులపాటు పల్లెలో నిద్రించాలని వైఎస్ జగన్ భావిస్తున్నారట. గడప దాటడం లేదు అనేవారికి ఈ పల్లెనిద్ర కార్యక్రమం ద్వారా జగన్ సమాధానం చెప్పాలని భావిస్తున్నారట. పల్లె నిద్ర వల్ల ఆయా గ్రామాల్లోని సమస్యలు కూడా పరిష్కారమవుతాయని ఆయన భావిస్తున్నారట.
నిజానికి జగన్ ప్రజా దర్భార్, రచ్చ బండ పేరిట కార్యక్రమం నిర్వహించాలని ప్రణాళిక వేసుకున్నారు. కానీ, ఇప్పుడు ఇక జగన్మోహన్ రెడ్డి జాబితాలో అవి లేనట్లే. వాటి రెండిటిని కలిపేలా వారాల్లో మూడు రోజుల పాటు వివిధ గ్రామాలలో ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఎన్నికలనే లక్ష్యంగా నిర్ధేశించుకొని జగన్ ఈ కార్యక్రమం పేరిట ముందుకు వెళుతున్నట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
తెలుగు కొత్త సంవత్సరం ఉగాది నుంచి ప్రతివారం మూడు రోజులపాటు పల్లెలో నిద్రించాలని వైఎస్ జగన్ భావిస్తున్నారు. తాజాగా గృహసారథులు అనే కాన్సెప్టును తీసుకువవచ్చిన సంగతి తెలిసిందే. మార్చిలో ఉగాది రోజు నుంచి వీరు కూడా ఇంటింటికీ తిరుగుతూ ప్రజలకు చేరువవుతారు. ఇప్పటి వరకు నాయకులకు, అధికారులకు పరిమితమైన పల్లెనిద్రను ఇకనుంచి జగన్ చేపట్టి ప్రజలలో మైలేజీ పెంచుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. మరి ఈ కార్యక్రమం వైసీపీ ఎంతవరకు కలిసి వస్తుందో చూడాల్సి ఉంది.