Children Savings : పిల్లలకు డబ్బు విలువలు తెలిసేలా ఇలా చేయండి..
పిల్లలకు చిన్నప్పటి నుండే ఒక ప్రణాళికబద్ధంగా డబ్బును ఖర్చు పెట్టడం నేర్పించాలి. వారికి డబ్బులను ఇచ్చి వారు ఏ విధంగా ఖర్చు చేయాలని అనుకుంటున్నారో చెప్పమనాలి. దానిలో అనవసర ఖర్చును తొలగించి...............

Children Savings : పిల్లలకు ఈ రోజుల్లో డబ్బుల విలువ తెలిసేలా పెంచాలి. ఎందుకంటే కొంతమంది వారికి ఇష్టమైనవి అని ధరతో సంభంధం లేకుండా కొనేస్తున్నారు. కానీ పిల్లలకు డబ్బు విలువ తెలియాలి అంటే మనం ఏ విధమైన ఖర్చు చేస్తున్నాము ఎలా చేస్తున్నాము అన్న విషయాలు వారి ముందు చర్చించాలి. పిల్లలు వారు ఖర్చు గురించి కూడా వారు ఆలోచించేలా చేయాలి. అంటే ఈ వారం ఎంత ఖర్చు చేస్తున్నారో అనేది పిల్లలను రాసుకోమని చెప్పాలి. దానిలో ఏది సరైన ఖర్చు, ఏది అనవసరమైన ఖర్చు అన్నది పిల్లలు తెలుసుకోవాలి.
లేకపోతే వారికి తమ ఖర్చులపై నియంత్రణ అనేది లేకుండా పోతుంది. కాబట్టి పిల్లలు స్వీయనియంత్రణ కలిగి ఉండేలా చూడాలి. లేకపోతే తరువాత వారు ఆర్థికంగా సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. కంప్యూటర్ గేమ్స్, మొబైల్ ఫోన్స్, సోషల్ మీడియా, ఖరీదయిన బొమ్మలు వంటి వాటికి అట్ట్రాక్ట్ అవ్వకుండా ఉండేలా చూడాలి. మనం పిల్లలకు పొదుపు చేయడం నేర్పించాలి. దానికి వారికి ముందుగా డబ్బులు ఇచ్చి వాటిని ఒక ప్రణాళిక వేసుకొని ఖర్చు చేయమని చెప్పాలి. దానిలో కావలసినవి మాత్రమే కొనుక్కుని మిగిలిన డబ్బును పొదుపు చేసేలా మనం పిల్లలకు చెప్పాలి.
Green Onions : ఉల్లికాడల వలన కూడా ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా?
పిల్లలకు చిన్నప్పటి నుండే ఒక ప్రణాళికబద్ధంగా డబ్బును ఖర్చు పెట్టడం నేర్పించాలి. వారికి డబ్బులను ఇచ్చి వారు ఏ విధంగా ఖర్చు చేయాలని అనుకుంటున్నారో చెప్పమనాలి. దానిలో అనవసర ఖర్చును తొలగించి పొదుపు చేయడం తెలిసేలా చెప్పాలి. ఈ విధంగా పొదుపు చేయడం పిల్లలకు అలవాటు చేయాలి. దీని ద్వారా పిల్లలు తరువాత ఆర్ధిక ఇబ్బందులకు గురవకుండా ఉంటారు. పిల్లలకు ఈ విధంగా డబ్బును ఎలా జాగ్రత్తగా ఖర్చు చేయాలో తెలపాలి.