Green Onions : ఉల్లికాడల వలన కూడా ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా?
ఉల్లిపాయలు అన్ని కూరల్లో వేసుకుంటాము. అలాగే ఉల్లికాడలు తినడం వలన మనకు చాలా రకాల ఆరోగ్యప్రయోజనాలు ఉన్నాయి. ఉల్లిపాయలు ఎక్కువగా నిలువ ఉంచితే వాటి పైన ఉల్లి కాడలు..............

Green Onions : ఉల్లిపాయలు అన్ని కూరల్లో వేసుకుంటాము. అలాగే ఉల్లికాడలు తినడం వలన మనకు చాలా రకాల ఆరోగ్యప్రయోజనాలు ఉన్నాయి. ఉల్లిపాయలు ఎక్కువగా నిలువ ఉంచితే వాటి పైన ఉల్లి కాడలు వస్తాయి అలా వచ్చిన వాటిని భూమిలో పాతితే ఉల్లికాడలు పెరుగుతాయి. వీటిని అట్లు, పచ్చడి, కూరలలో వేసుకొని, కొత్తిమీర లాగా అన్ని వంటల్లో పైన గార్నిష్ లాగా వేసుకొని తినవచ్చు లేదా విడిగా కూడా ఉల్లికాడలను తినవచ్చు. ఉల్లికాడలను మన ఇంటిలో సులభంగా పెంచవచ్చు లేదా మార్కెట్ లో కూడా ఉల్లికాడలు అమ్ముతుంటారు. వీటివలన కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
*ఉల్లికాడలలో ఉండే విటమిన్ ఎ మరియు విటమిన్ సి మనల్ని ఇన్ఫెక్షన్ల బారి నుండి కాపాడుతుంది.
*ఉల్లికాడలు మన శరీరానికి కావలసిన పోషకాలను అందించి జీవక్రియలను నియంత్రించేలా చేస్తుంది.
*ఉల్లికాడలు మన శరీరంలో రోగనిరోధకశక్తిని పెంచుతాయి.
*మధుమేహంతో భాధపడేవారు ఉల్లికాడలు తినడం వలన మంచి ప్రయోజనం ఉంటుంది.
*ఉల్లికాడలు తినడం వలన దానిలో ఉండే అల్లిసిన్ అనే రసాయన పదార్థం మన చర్మం తొందరగా ముడతలు పడకుండా ఉండేలా చేస్తుంది.
*ఉల్లికాడలు తినడం వలన అవి మన శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచి చక్కర నిలువలు పెరగకుండా ఉండేలా చేస్తుంది.
*మన శరీరంలో క్యాన్సర్ కణాలను ఉత్పత్తి చేసే ఎంజైమ్ ల విడుదలను అడ్డుకునేలా ఉల్లికాడలు చేస్తాయి.
*ఉల్లికాడలలో ఉండే విటమిన్ కె ఎముకలు బలంగా ఉండేలా చేస్తాయి.
*ఉలికాడలలో ఐరన్, మెగ్నీషియం, ఫైబర్ పోషకాలు ఉంటాయి.
*ఉల్లికాడలలో ఉండే యాంటి బ్యాక్టీరియల్, యాంటి వైరల్ గుణాలు మనకు ఎప్పుడూ సాధారణంగా వచ్చే జలుబు, దగ్గులను రాకుండా ఉండేలా చేస్తాయి.
Food in Restaurants : రెస్టారెంట్స్ లో మరీ ఎక్కువ తినేస్తున్నారా? తక్కువ తినాలంటే ఏం చేయాలి?
అందుకే ఉల్లికాడలను కూడా మన ఆహారంలో భాగం చేసుకోవాలి. ఆరోగ్యమే కాదు ఇవి మంచి రుచిగా కూడా ఉంటాయి. వీటిని మనమే సొంతంగా పండించుకోవచ్చు కూడా.