Food in Restaurants : రెస్టారెంట్స్ లో మరీ ఎక్కువ తినేస్తున్నారా? తక్కువ తినాలంటే ఏం చేయాలి?

ఇటీవల చాలా మంది వారానికి ఒకసారి అయినా రెస్టారెంట్లో తినాలని అనుకుంటున్నారు. చాలామంది అలాగే చేస్తున్నారు. కానీ రెస్టారెంట్లో తినే పదార్థాలు అన్నీ మన ఆరోగ్యానికి మంచివి కాదు. కాబట్టి............

Kaburulu

Kaburulu Desk

February 27, 2023 | 08:16 PM

Food in Restaurants : రెస్టారెంట్స్ లో మరీ ఎక్కువ తినేస్తున్నారా? తక్కువ తినాలంటే ఏం చేయాలి?

Food in Restaurants :  ఇటీవల చాలా మంది వారానికి ఒకసారి అయినా రెస్టారెంట్లో తినాలని అనుకుంటున్నారు. చాలామంది అలాగే చేస్తున్నారు. కానీ రెస్టారెంట్లో తినే పదార్థాలు అన్నీ మన ఆరోగ్యానికి మంచివి కాదు. కాబట్టి వాటిలో ఆరోగ్యానికి మంచివి ఏమి ఉన్నాయో చూసుకొని ఆర్డర్ చేసుకోవాలి. అలాగే మొదట రెస్టారెంట్ కి వెళ్లాలని అనుకుంటే ముందు మనకు దగ్గరలో ఏ రెస్టారెంట్ లో ఫుడ్ బాగుంటుందో కనుక్కోవాలి. ఇంకా దానిలో ఏఏ ఐటమ్స్ ఉంటాయో మనం ముందుగానే ఆన్లైన్లో చూడాలి.

ఇలా ఏ రెస్టారెంట్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ముందుగా మనం రెస్టారెంట్ కి వెళ్ళగానే భోజనం ఆర్డర్ చేయకుండా సూప్స్ లేదా ఫ్రూట్ సలాడ్ లు ఆర్డర్ చేయాలి. అవి మన ఆరోగ్యానికి మంచిది ఇంకా దీనివలన మనం తక్కువ భోజనం తింటాము. మనం చాలామంది కొత్తవి తినాలని ట్రై చెయ్యాలని అనుకుంటాము కానీ రెస్టారెంట్లో అన్నింటిలోనూ ఎక్కువగా నూనెలు, కొవ్వు పదార్థాలు ఉన్నవే ఉంటాయి. అవి మన ఆరోగ్యానికి మంచిది కాదు కాబట్టి అలా చేయకూడదు.

వాటిలో మనం ఆర్డర్ ఇచ్చేముందు కొన్నిటికి ఫ్రైడ్, గ్రిల్, స్టీమ్డ్ అని ఉంటాయి. వాటిలో స్టీమ్డ్ ఉన్నవి ఆర్డర్ చేసుకోవాలి. ఇవి మన ఆరోగ్యానికి కూడా మంచిది. ఫ్రైడ్, గ్రిల్ ఐటమ్స్ మన ఆరోగ్యానికి అంత మంచివి కాదు. అలాగే ఫ్రెండ్స్, సన్నిహితులు, బంధువులతో కలిసి వెళ్తుంటారు. వారు ఏమైతే ఆర్డర్ ఇస్తారో అవే మనం ఆర్డర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కాబట్టి మనం మన ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఆర్డర్ ఇవ్వాలి.

Cooking Oil : ఒకసారి ఉపయోగించిన వంట నూనెను మళ్ళీ మళ్ళీ వాడుతున్నారా? అయితే సమస్యలు తప్పవు..

మనం రెస్టారెంట్లో ఏది ఆర్డర్ చేసినా అది మనకు ఎక్కువ మొత్తంలో ఉంటుంది. కాబట్టి దానిని మనం అందరికీ షేర్ చేయడం వలన మనం తక్కువగా తినవచ్చు. రెస్టారెంట్లో పిజ్జా, బర్గర్ లు ఆర్డర్ ఇచ్చినప్పుడు కొంతమంది ఎక్కువ చీజ్ తో టాపింగ్ చేయించుకుంటారు. కానీ అలా చేయించుకోకూడదు. దానికి బదులు కూరగాయముక్కలను టాపింగ్ చేయించుకోవచ్చు. ఈ విధంగా రెస్టారెంట్లో మనం తక్కువగా ఆరోగ్యకరంగా తినవచ్చు.