Cooking Oil : ఒకసారి ఉపయోగించిన వంట నూనెను మళ్ళీ మళ్ళీ వాడుతున్నారా? అయితే సమస్యలు తప్పవు..

వంటలు వండుకోవాలంటే నూనెను వాడుకోవాల్సిందే. అయితే పిండి వంటలు, పూరీలు, వడలు, గారెలు, బజ్జీలు వంటివి వండుకున్నప్పుడు మనం ఉపయోగించిన నూనెను మళ్ళీ మళ్ళీ వాడకూడదు. కానీ..........

Kaburulu

Kaburulu Desk

February 27, 2023 | 08:06 PM

Cooking Oil : ఒకసారి ఉపయోగించిన వంట నూనెను మళ్ళీ మళ్ళీ వాడుతున్నారా? అయితే సమస్యలు తప్పవు..

Cooking Oil :  వంటలు వండుకోవాలంటే నూనెను వాడుకోవాల్సిందే. అయితే పిండి వంటలు, పూరీలు, వడలు, గారెలు, బజ్జీలు వంటివి వండుకున్నప్పుడు మనం ఉపయోగించిన నూనెను మళ్ళీ మళ్ళీ వాడకూడదు. కానీ మనం చాలామంది మన ఇళ్లల్లో ఒకసారి డీప్ ఫ్రై కి వాడిన నూనెను మళ్ళీ వేపుళ్ళకి, రకరకాల వంటలకు వాడుతుంటాము. ఇలా చేస్తే మనకు చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి.

ఆహారభద్రత ప్రమాణాల మేరకు ఒకసారి వాడిన నూనెను ఇంకొకసారి అన్ని రకాల వంటలకు వాడకూడదు. నూనెలో టోటల్ పోలార్ కాంపౌండ్స్ లెవెల్స్ 25 శాతానికి చేరుకోగానే ఆ నూనెను మార్చాలి. అలా చేయకుండా మళ్ళీ ఆ నూనెను వాడితే దానిలో చెడు కొలెస్ట్రాల్ తయారవుతుంది. ఆ చెడు కొలెస్ట్రాల్ మన గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ఒకసారి వాడిన నూనెను మళ్ళీ మళ్ళీ వాడితే ఉదర సంబంధ క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంది. నూనెను మళ్ళీ వాడడం వలన కడుపులో నొప్పి, కడుపులో మంట వంటివి వస్తాయి.

నూనెను మనం ఒక్కసారి ఉపయోగిస్తే దానిలోని పోషకాలు అన్నింటిని మనం ఉపయోగించుకున్నట్లే కాబట్టి రెండోసారి నూనెను ఉపయోగించకూడదు. అయినా ఆ నూనెను ఉపయోగించినట్లు అయితే రక్తనాళాలు గట్టిపడడం, అల్జీమర్స్, కాలేయ సంబంధ వ్యాధులు, హైపర్ టెన్షన్ వంటి అనేక రకాల సమస్యలు వస్తాయి. ఒకసారి వాడిన నూనెను మళ్ళీ వాడితే అది ఫ్రీరాడికల్స్ ని పెంచుతుంది. అవి మనకు ప్రమాదకరమైన అనారోగ్య సమస్యలు వచ్చేలా చేస్తాయి. క్యాన్సర్, రక్తనాళాలు బ్లాక్ అవ్వడం వంటివి కూడా జరుగుతుంటాయి.

Shawarma : షవర్మా తింటున్నారా? అయితే అనారోగ్యాలు కొని తెచ్చుకున్నట్టే..

కాబట్టి ఏవైనా పిండి వంటలు చేసేటప్పుడు ముందు గిన్నె నిండా నూనెను పోయకుండా తక్కువ తక్కువగా నూనెను పోసుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వలన కాగిన నూనె తక్కువగా మిగులుతుంది. ఆ నూనెని మళ్ళీ పిండివంటలకు ఉపయోగించకుండా దానిని బాగా వడగట్టి పైపైన వేసే వాటిల్లో లేదా దీపాలు వెలిగించుకోవడానికి వాడుకోవచ్చు. అంతే కానీ పూర్తి వంటల్లోకి మళ్ళీ బాగా వాడిన నూనెను వాడకూడదు. బయట హోటల్స్ లో పూరీలు, బజ్జీలు.. ఇలాంటి వాటికి వాడిన నూనెనే మళ్ళీ మళ్ళీ వాడతారు కాబట్టి బయట ఆయిల్ ఫుడ్ తినకపోవడమే మంచిది.