Shawarma : షవర్మా తింటున్నారా? అయితే అనారోగ్యాలు కొని తెచ్చుకున్నట్టే..
ఇప్పటికే కేరళలో షవర్మాని బ్యాన్ చేశారు. తమిళనాడులోని కొన్ని ప్రదేశాల్లో కూడా షవర్మాని బ్యాన్ చేశారు. ఇంకొన్ని రాష్ట్రాల్లో కూడా షవర్మాని బ్యాన్ చేసే ఆలోచనలో ఉన్నారు. ఇటీవల షవర్మా తిని........

Shawarma : ప్రస్తుతం చాలా మంది సాయంత్రం అయితే చాలు ఏదయినా వెరైటీ తినాలని అనుకుంటారు. ఈ మధ్య కొత్తగా షవర్మాను అందరూ ఎక్కువగా ఇష్టంగా తింటున్నారు. కానీ దీనిని తినడం వలన మనం అనారోగ్యాలను కావాలని తెచ్చుకున్నట్లే. దీనిలో అన్ని రకాల మసాలాలు వాడడం వలన ఇది మన ఆరోగ్యానికి మంచిది కాదు. దీనిలో ఉపయోగించే చికెన్ మంచిది కాకపోయినా అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి.
షవర్మాలో ఎక్కువగా సోడియం ఉంటుంది కాబట్టి దీనిని తింటే మన శరీరంలో సోడియం నిలువలు పెరిగి కీళ్లలో స్పటికాలు ఏర్పడి ఎక్కువగా నొప్పి కలుగుతుంది. దీనిని తినడం వలన కిడ్నీలలో స్టోన్స్, కిడ్నీలకు సంబంధించిన వ్యాధులు ఏర్పడతాయి. షవర్మాను కొద్దిగా తిన్నా మన శరీరంలో చెడు కొవ్వు ఎక్కువగా పేరుకుపోతుంది. కార్బోహైడ్రేట్లు కూడా అధికంగా ఉంటాయి కాబట్టి దీనిని తినడం వలన బరువు ఎక్కువగా పెరుగుతారు. ఈ విధంగా అధికంగా బరువు పెరగడం వలన బద్దకంగా తయారవుతారు. ఇంకా మెదడు చురుకుగా పని చేయడం తగ్గుతుంది.
కొలెస్ట్రాల్ ఎక్కువగా శరీరంలో పేరుకుపోవడం వలన గుండెపోటు వంటివి వచ్చే ప్రమాదం ఉంది. అధికంగా కొలెస్ట్రాల్ చేరడం వలన డయాబెటిస్ కూడా వచ్చే అవకాశం ఉంది. షవర్మాను తినడం వలన పాదాలలో వాపులు కూడా వస్తాయి. కాబట్టి షవర్మాను తినడం మన ఆరోగ్యానికి మంచిది కాదు. ఇంకా దీనిని తయారుచేసే వారు శుభ్రతను సరిగా పాటించకపోయినా ఫుడ్ పాయిజన్ అయ్యి కూడా అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి. అలాగే ఇది రోజంతా ఎలక్ట్రిక్ మంట మీద కాలుతూనే ఉంటుంది, దీనివలన కూడా అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి.
Flower Vase : ఫ్లవర్ వాజ్ లో ఉంచే పువ్వులు ఎక్కువకాలం ఫ్రెష్ గా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా?
ఇప్పటికే కేరళలో షవర్మాని బ్యాన్ చేశారు. తమిళనాడులోని కొన్ని ప్రదేశాల్లో కూడా షవర్మాని బ్యాన్ చేశారు. ఇంకొన్ని రాష్ట్రాల్లో కూడా షవర్మాని బ్యాన్ చేసే ఆలోచనలో ఉన్నారు. ఇటీవల షవర్మా తిని పలువురు హాస్పిటల్ పాలైన పలు సంఘటనలు వార్తల్లో నిలిచాయి. కాబట్టి ఎక్కడ షవర్మా తినాలని మీరు అనుకున్నా మనకు వచ్చే ఆరోగ్య సమస్యలను తెలుసుకొని దానిని తినడం దూరం పెట్టండి. అది తినకపోవడమే ఆరోగ్యానికి మంచిది.