Flower Vase : ఫ్లవర్ వాజ్ లో ఉంచే పువ్వులు ఎక్కువకాలం ఫ్రెష్ గా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా?
పువ్వులంటే అందరికీ ఇష్టమే అంతే కాకుండా వాటిని చూడడం వలన మన మైండ్ ఎంతో రిలీఫ్ గా మరియు ఇల్లు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి చాలా మంది తమ ఇళ్లల్లో ఫ్లవర్ వాజ్ లలో ప్లాస్టిక్ కాకుండా రియల్ పువ్వులు పెడుతుంటారు. కానీ అవి........

Flower Vase : పువ్వులంటే అందరికీ ఇష్టమే అంతే కాకుండా వాటిని చూడడం వలన మన మైండ్ ఎంతో రిలీఫ్ గా మరియు ఇల్లు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి చాలా మంది తమ ఇళ్లల్లో ఫ్లవర్ వాజ్ లలో ప్లాస్టిక్ కాకుండా రియల్ పువ్వులు పెడుతుంటారు. కానీ అవి ఒక్కొక్కసారి తొందరగా వాడిపోతుంటాయి. అలా కాకుండా ఎక్కువకాలం ఫ్లవర్స్ ఫ్రెష్ గా ఉండాలంటే మనం కొన్ని టిప్స్ పాటించి చూడవచ్చు.
మనం మొదట ఫ్లవర్ వాజ్ లో పువ్వులను పెట్టేటప్పుడు అవి ఏ రకం పువ్వులు అయినా వాటి చివర కాడను కత్తిరించాలి అప్పుడు ఆ కాడ నీటిని పీల్చుకుంటుంది కాబట్టి పూలు ఎక్కువసేపు ఫ్రెష్ గా ఉంటాయి. మనం ఎక్కువగా ఫ్లవర్ వాజ్ లో పెట్టడానికి గులాబీలు, లిల్లీలు కొని పెడుతుంటాము. కానీ అవి ఒక్కొక్కసారి మన ఇంటికి తీసుకొచ్చేటప్పడికే వాడిపోతుంటాయి. అలా కాకుండా ఉండాలంటే మనం కొనేముందు గులాబీ పువ్వులు అయితే వాటి కాడ దగ్గర మనం నొక్కి చూస్తే మెత్తగా ఉంటె పాత పువ్వులు అని కొంచెం మెత్తగా కొంచెం గట్టిగ ఉంటే అవి ఫ్రెష్ గులాబీ పువ్వులు అని మనం గ్రహించాలి. అలా ఫ్రెష్ గా ఉన్నవి తెచ్చుకోవాలి.
పూలను నీళ్ళల్లో పెట్టేటప్పుడు వాటి ఆకులు నీటిలో మునగకుండా ఉంచాలి. అదే నీటిలో ఆకులు మునిగితే బ్యాక్టీరియా చేరి పూలు తొందరగా ఫ్రెష్ నెస్ ను కోల్పోతాయి. కాబట్టి నీటిలో పూలను ఉంచేముందు ఏమైనా వాటి చుట్టూ ఆకులు ఉంటే వాటిని తొలగించాలి. అప్పుడు పూలు ఎక్కువసేపు ఫ్రెష్ గా ఉంటాయి. ఫ్లవర్ వాజ్ లో ఉంచే నీటిని రెండు రోజులకు ఒకసారి మారుస్తుండాలి. లేదా నీరు జిగురుగా అనిపించినా మార్చాలి. అప్పుడే పూలు ఎక్కువరోజులు ఫ్రెష్ గా ఉంటాయి. ఇంకా వాడిపోతున్న పూల రేకలని, ఆకులని తీసేస్తూ ఉంటే కూడా ఎక్కువ రోజులు ఫ్రెష్ గా ఉంటాయి.
Meal Maker Pakodi : మిల్మేకర్ పకోడీ తిన్నారా?? ఇంట్లో సింపుల్ గా ఇలా చేసేసుకోండి..
ఫ్లవర్ వాజ్ లో ఉంచే పూలను రాత్రిపూట ఫ్రిజ్ లో ఉంచాలి అప్పుడే పూలు తాజాదనాన్ని కోల్పోకుండా ఉంటాయి. పూలను ఎక్కువగా ఎండా తగిలేచోట ఉంచవద్దు. ఇంటిలో చల్లగా అనిపించే ప్రదేశంలో ఉంచడం వలన కూడా పూలు ఎక్కువ రోజులు ఫ్రెష్ గా ఉంటాయి. ఫ్లవర్ వాజ్ నీటిలో పంచదార లేదా కాపర్ కాయిన్ ఉంచినా పూలు తాజాగా ఉంటాయి. కాబట్టి ఇంటిలో ఫ్లవర్ వాజ్ లో రియల్ పూలు ఉంచేవారు ఈ టిప్స్ ను ఉపయోగించి పూలు తాజాగా ఉంచి ఇల్లు సువాసనలతో ప్రశాంతంగా ఉండేలా చేసుకోండి.