Oil Food : నూనె, మషాలా ఫుడ్స్‌కి ఒక్క నెల రోజులు దూరంగా ఉండండి.. ఆరోగ్యంలో మార్పులు చూడండి..

 ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ రోజు మొత్తంలో ఏదో ఒకటి వేయించిన ఆహార పదార్థాలను తింటున్నారు. కానీ మీరు వేయించిన ఆహారపదార్థాలు (పూరీలు, బజ్జీలు, పునుకులు, వేపుడులు, మసాలాలు) తినకుండా ఒక నెల రోజులు....................

Kaburulu

Kaburulu Desk

February 28, 2023 | 07:34 PM

Oil Food : నూనె, మషాలా ఫుడ్స్‌కి ఒక్క నెల రోజులు దూరంగా ఉండండి.. ఆరోగ్యంలో మార్పులు చూడండి..

Oil Food :  ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ రోజు మొత్తంలో ఏదో ఒకటి వేయించిన ఆహార పదార్థాలను తింటున్నారు. కానీ మీరు వేయించిన ఆహారపదార్థాలు (పూరీలు, బజ్జీలు, పునుకులు, వేపుడులు, మసాలాలు) తినకుండా ఒక నెల రోజులు ఉండండి. దీని వలన మన శరీరంలో వచ్చే మార్పులను గమనించవచ్చు. వాటిలో ముఖ్యంగా మొదట మన శరీరంలో జీర్ణక్రియ మెరుగుపడుతుంది. నూనెకు సంబంధించిన వేయించిన పదార్థాలను తినడం వలన మన కడుపులో గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు వస్తాయి.

ఈ రోజుల్లో వేయించిన మసాలా పదార్థాలు కూడా ఎక్కువగా తింటున్నారు దీని వలన అధిక బరువు సమస్య ఏర్పడుతుంది. అధిక బరువు సమస్య ఉన్నవారు తాము తినే ఆహారంలో వేయించిన పదార్థాలకు మసాలాలకు దూరంగా ఉండాలి. దీని వలన అధిక బరువు ఉన్నవారు కొద్దిగా బరువు తగ్గుతారు. అధిక బరువు ఉన్నవారు తగ్గడానికి తమ డైట్ లో నూనెకు సంబంధించిన ఆహార పదార్థాలను తీసుకోకూడదు. దీని వలన అధిక బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

నూనెకు సంబంధించిన ఆహార పదార్థాలను తినడం వలన మన చర్మం పైన కూడా నూనె చేరుతుంది. ముఖం జిడ్డుగా మారుతుంది. ఒక నెల రోజులు నూనెకు సంబంధించిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండడం వలన మన చర్మం కాంతివంతంగా తయారవుతుంది. ఇంకా మన మానసిక స్థితి కూడా మెరుగుపడుతుంది. మన శరీరంలో రోగ నిరోధకశక్తి కూడా పెరుగుతుంది.

Honey Benefits : తేనెని ఆహారంలో భాగం చేసుకోండి.. తేనే వలన కలిగే ప్రయోజనాలు మీకు తెలుసా?

మనకు లివర్ కు సంబంధించిన సమస్యలు ఉన్నా నూనెకు సంబంధించిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. మన శరీరంలో ఏమైనా వాపులు ఉన్న తగ్గుతాయి. మనకు సరైన నిద్ర కూడా పడుతుంది. కాబట్టి వీలైనంత వరకు నూనెకు సంబంధించిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి.