Capsicum Bajji : క్యాప్సికమ్ తో ఇంట్లోనే సింపుల్ గా ఇలా బజ్జీ చేసుకోండి..

కూరగాయల్లో క్యాప్సికమ్ ని కూర, సలాడ్ లలో ఎక్కువగా వాడుతుంటారు. వీటితో బజ్జీ చేస్తే కూడా చాలా బాగుంటుంది. మన ఇంట్లోనే అన్ని రకాల బజ్జిలు చేసినట్టే సింపుల్ గా క్యాప్సికం బజ్జి కూడా చేసుకోవచ్చు.......................

Kaburulu

Kaburulu Desk

January 29, 2023 | 03:04 PM

Capsicum Bajji : క్యాప్సికమ్ తో ఇంట్లోనే సింపుల్ గా ఇలా బజ్జీ చేసుకోండి..

Capsicum Bajji :  కూరగాయల్లో క్యాప్సికమ్ ని కూర, సలాడ్ లలో ఎక్కువగా వాడుతుంటారు. వీటితో బజ్జీ చేస్తే కూడా చాలా బాగుంటుంది. మన ఇంట్లోనే అన్ని రకాల బజ్జిలు చేసినట్టే సింపుల్ గా క్యాప్సికం బజ్జి కూడా చేసుకోవచ్చు.

క్యాప్సికమ్ బజ్జీ తయారీకి కావాల్సిన పదార్థాలు:-
* క్యాప్సికమ్ ఆరు లేదా ఎనిమిది
* శనగపిండి ఒక కప్పు
* ఉప్పు తగినంత
* కారం తగినంత
* పసుపు కొద్దిగా
* ధనియాల పొడి కొద్దిగా
* వంటసోడా కొద్దిగా
* నూనె తగినంత

ముందుగా ఒక బౌల్ లో శనగపిండి, ఉప్పు, కారం, వంట సోడా, ధనియాల పొడి కొద్దిగా పసుపు వేసి నీటిని కలిపి కలుపుకోవాలి. క్యాప్సికమ్ ని మధ్యలో చీల్చుకోవాలి. ఒక మూకుడులో నూనెను కాగబెట్టాలి. నూనె కాగిన తరువాత దానిలో చీల్చిన క్యాప్సికమ్ ని శనగపిండిలో ముంచి నూనె లో వేయాలి. బాగా వేపుకోవాలి. కావాలనుకుంటే క్యాప్సికం మధ్యలో నువ్వులపొడి కొద్దిగా ముద్దలాగా పెట్టుకొని శనగపిండిలో ముంచి వేపుకోవచ్చు. ఇలా తయారు చేసిన క్యాప్సికం బజ్జి చాలా రుచిగా ఉంటుంది. సాయంత్రం పూట స్నాక్స్ గా దీనిని తయారు చేసుకోవచ్చు.

Apple Slices : ఆపిల్ ముక్కలు నల్లగా అవ్వకుండా ఉండాలంటే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..

మాములు మిర్చి బజ్జిల్లాగే వీటిని కూడా మధ్యలో కట్ చేసి ఉల్లిపాయలు, ఉప్పు, కారం వేసి నిమ్మకాయ పిండుకొని తినొచ్చు.