Protein Food : శాకాహారులు మాంసాహారంలోని ప్రోటీన్స్ కోసం ఎలాంటి ఆహరం తినాలో తెలుసా??

మాంసాహారం తినేవారు మాంసం తినడం వలన ఎక్కువ ప్రోటీన్స్ ని వారి శరీరానికి అందజేస్తారు. కానీ శాకాహారులు మాంసం తినరు కాబట్టి ఎలాంటి ఆహరం తినడం వలన ప్రోటీన్స్ పొందుతారో తెలుసుకొని తినాలి.............

Kaburulu

Kaburulu Desk

February 5, 2023 | 10:06 AM

Protein Food : శాకాహారులు మాంసాహారంలోని ప్రోటీన్స్ కోసం ఎలాంటి ఆహరం తినాలో తెలుసా??

Protein Food :  మాంసాహారం తినేవారు మాంసం తినడం వలన ఎక్కువ ప్రోటీన్స్ ని వారి శరీరానికి అందజేస్తారు. కానీ శాకాహారులు మాంసం తినరు కాబట్టి ఎలాంటి ఆహరం తినడం వలన ప్రోటీన్స్ పొందుతారో తెలుసుకొని తినాలి. దీని వలన తగినంత ప్రోటీన్స్ శరీరానికి అందుతాయి. ప్రోటీన్స్ వలన మన ఎముకలు బలంగా ఉంటాయి. అయితే ప్రోటీన్స్ ఎలాంటి ఆహరం తింటే, ఎన్ని ప్రోటీన్స్ మన శరీరానికి అందుతాయి అనేది తెలుసుకుందాము.

గుడ్లు ఇపుడు చాలామంది శాకాహారం కింద తీసుకుంటున్నారు. గుడ్లు ప్రోటీన్లను మన శరీరానికి పుష్కలంగా అందజేస్తాయి. శాకాహారులు రోజుకు ఒక గుడ్డు అయినా తినడం వలన ప్రోటీన్స్ లోపం మనకు రాదు. గుడ్డుతో కూర, పులుసు, ఆంబ్లేట్ లేదా ఉడికించిన గుడ్డును తినవచ్చు. ఇలా ఏ విధంగా అయినా గుడ్డును తినవచ్చు. కానీ ఉడికించిన గుడ్డును తినడం వలన ఎక్కువ ప్రోటీన్స్ ను పొందవచ్చు.

కొంతమంది శాకాహారులు గుడ్డు కూడా తినని వారు ఉంటారు. అలాంటి వారు ఇప్పుడు చెప్పే ఆహార పదార్థాలను తినడం ద్వారా ప్రోటీన్స్ ను పొందవచ్చు. వేరుశనగ వెన్న దీనిలో కూడా పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇప్పుడు బయట పీనట్ బటర్ అని దొరుకుతుంది. ఈ పీనట్ బటర్ ను రోజూ కొద్దిగా తినడం ద్వారా మన శరీరానికి ప్రోటీన్స్ ని అందజేయవచ్చు.

శనగల్లో కూడా పోషకాలు అధికంగా ఉంటాయి. శనగలను ఉడికించి, కూర రూపంలో, లేదా నానబెట్టినవి తినొచ్చు. వీటిని కూడా రోజూ తినవచ్చు. దీని వలన మన శరీరానికి పోషకాలు అందుతాయి.

పాలలో క్యాల్షియం మరియు అన్ని రకాల పోషకాలు అధికంగా ఉంటాయి. రోజూ ఒక గ్లాసు పాలు తాగడం వలన మన శరీరానికి పోషకాలను అందించవచ్చు. చలికాలంలో పసుపు పాలను తాగడం ద్వారా జలుబు, దగ్గు వంటివి తొందరగా తగ్గుతాయి. దీని వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

Plastic Straw : ప్లాస్టిక్ స్ట్రాలు ఎక్కువగా వాడుతున్నారా?? అయితే జాగ్రత్త.. ఎన్ని అనారోగ్యాలు వస్తాయో తెలుసా??

మొలకెత్తిన గింజలు(sprouts) కూడా రోజుకు గుప్పెడు తినాలి. ఇంకా వాల్నట్స్ కూడా రోజుకు గుప్పెడు తినాలి. ఈ విధంగా ఈ పదార్థాలు మన ఆహారంలో భాగంగా చేసుకోవడం వలన శాకాహారులు తమ శరీరానికి ప్రోటీన్స్ ని తొందరగా అందజేస్తారు.