Ravanasura Trailer : రావణాసుర ట్రైలర్ వచ్చేసింది.. ఈసారి విలనిజంతో హిట్టు కొట్టేలా ఉన్నాడు..

ధమాకా వంటి బ్లాక్ బస్టర్ హిట్టు తరువాత రవితేజ 'రావణాసుర' అనే సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ తో వస్తున్నాడు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ని కూడా రిలీజ్ చేశారు.

Kaburulu

Kaburulu Desk

March 28, 2023 | 08:10 PM

Ravanasura Trailer : రావణాసుర ట్రైలర్ వచ్చేసింది.. ఈసారి విలనిజంతో హిట్టు కొట్టేలా ఉన్నాడు..

Ravanasura Trailer : మాస్ మహారాజ రవితేజ ‘ధమాకా’ ఇచ్చిన హిట్టుతో ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఈ సినిమాలో ఒకప్పటి తన మార్క్ కామెడీని, మాస్ ని ఆడియన్స్ కి మళ్ళీ పరిచయం చేయడంతో థియేటర్లు హౌస్ ఫుల్‌లు అయ్యాయి. దీంతో భారీ కలెక్షన్స్ చూసి 100 కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టాడు. ఇక ఈ సినిమా తరువాత రవితేజ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘రావణాసుర’. స్వామి రారా ఫేమ్ సుధీర్ వర్మ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ మూవీ ఏప్రిల్ 7న రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఆడియన్స్ ముందుకు వచ్చిన టీజర్ మంచి బజ్ ని క్రియేట్ చేసింది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ని కూడా రిలీజ్ చేశారు.

OM Raut gave Adipurush Update..

ఇక ఈ సినిమాలో రవితేజ నెగటివ్ షేడ్ లో కనబడబోతున్నాడని సినిమా పోస్టర్స్ రిలీజ్ అయిన దగ్గర నుంచి తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో ఇంకా చాలా షేడ్స్ ఉన్నాయి అని ట్రైలర్ చూస్తుంటే అర్ధమవుతుంది. ఈ మూవీలో రవితేజ లాయర్ పాత్రలో కనిపించబోతున్నాడు. మొదట ట్రైలర్ లో లాయర్ క్యారెక్టర్ తో రవితేజ మార్క్ కామెడీ చూపించినా, ఆ తరువాత ఆ లాయర్ నే నెగటివ్ షేడ్స్ లో కూడా చూపించారు. మరి ఒక్కడే విలన్ గా, హీరోగా కనిపిస్తున్నాడా? లేదా? ఇద్దరు రవితేజలు ఉన్నారా? అనేది సస్పెన్స్ గా ఉంది. ట్రైలర్ మాత్రం ఆడియన్స్ లో క్యూరియాసిటీని క్రియేట్ చేసింది.

Nagababu: సీఎం సీఎం అని అరిస్తే సరిపోదు.. ఓట్లు గుద్దితే అవుతుంది.. ఫ్యాన్స్‌పై నాగబాబు అసహనం!

కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా అను ఇమ్మాన్యుయేల్ నటిస్తుండగా.. ఫరియా అబ్దుల్లా, మేఘ ఆకాష్, దక్ష నాగర్కర్, పూజిత పొన్నాడ భామలు కూడా నటిస్తూ మూవీకి మరింత గ్లామర్ తీసుకు వచ్చారు. ఇక అక్కినేని హీరో సుశాంత్ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. దాదాపు 50 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని రవితేజ, అభిషేక్ నమతో కలిసి నిర్మిస్తున్నాడు. ఈ మూవీ సక్సెస్ పై రవితేజ ఫుల్ కాన్ఫిడెన్స్ గా ఉన్నాడు.