Writer Padmabhushan : రైటర్ పద్మభూషణ్ స్పెషల్ ఆఫర్.. ఆడవాళ్లందరికి ఈ సినిమా ఫ్రీ షోలు..

రైటర్ పద్మభూషణ్ సినిమా హిట్ టాక్ తెచ్చుకోవడంతో చిన్న సినిమాగా రిలీజయి ఇప్పుడు కలెక్షన్స్ కొల్లగొడుతుంది. రైటర్ పద్మభూషణ్ సినిమా మూడు రోజుల్లోనే దాదాపు 6 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. సినిమా ప్రాఫిట్స్ జోన్ లోకి వచ్చేసింది. దీంతో ఈ సినిమా టీం సరికొత్త ఆఫర్ ఇచ్చింది. తాజాగా...............

Kaburulu

Kaburulu Desk

February 7, 2023 | 03:03 PM

Writer Padmabhushan : రైటర్ పద్మభూషణ్ స్పెషల్ ఆఫర్.. ఆడవాళ్లందరికి ఈ సినిమా ఫ్రీ షోలు..

Writer Padmabhushan :  సుహాస్ హీరోగా ఇటీవల వచ్చిన సినిమా రైటర్ పద్మభూషణ్. టీనా శిల్పారాజ్ హీరోయిన్ గా, రోహిణి, ఆశిష్ విద్యార్ధి ముఖ్యపాత్రల్లో కొత్త దర్శకుడు షణ్ముఖ్ దర్శకత్వంలో, ఛాయ్ బిస్కెట్ ఫిలిమ్స్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 3న థియేటర్స్ లో రిలీజయింది. రిలీజయిన మొదటి రోజు నుంచే ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కామెడీ, ఎమోషన్స్, అమ్మ సెంటిమెంట్ అంశాలతో ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ని మెప్పిస్తుంది.

రైటర్ పద్మభూషణ్ సినిమా హిట్ టాక్ తెచ్చుకోవడంతో చిన్న సినిమాగా రిలీజయి ఇప్పుడు కలెక్షన్స్ కొల్లగొడుతుంది. రైటర్ పద్మభూషణ్ సినిమా మూడు రోజుల్లోనే దాదాపు 6 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. సినిమా ప్రాఫిట్స్ జోన్ లోకి వచ్చేసింది. దీంతో ఈ సినిమా టీం సరికొత్త ఆఫర్ ఇచ్చింది. తాజాగా యాంకర్ సుమ తో కలిసి రైటర్ పద్మభూషణ్ చిత్ర యూనిట్ ఓ ప్రెస్ మీట్ నిర్వహించారు.

Agent : 3 కోట్ల యాక్షన్ సీక్వెన్స్‌ని స్క్రాప్ చేసిన అఖిల్.. రీ షూట్‌కి ఏజెంట్?

ఈ ప్రెస్ మీట్ లో.. రైటర్ పద్మభూషణ్ సినిమాని ఫిబ్రవరి 8న ఏపీ, తెలంగాణలోని 38 థియేటర్స్ లో అన్ని షోలు ఆడవాళ్లందరికి ఉచితంగా సినిమా చూపిస్తామని ప్రకటించారు. ఇది రేపొక్కరోజు మాత్రమే ఆఫర్. సినిమాలో మహిళల గురించి సెంటిమెంట్ ఉండటంతో, సినిమా మంచి సక్సెస్ సాధించడంతో, వుమెన్ వెడ్నస్ డే అని రేపు ఈ సినిమాని ఫ్రీగా ఆడవాళ్ళకి ప్రదర్శిస్తున్నారు.