Manchu Family: తెరపైకి మంచు బ్రదర్స్ కొట్లాట వీడియో.. కొడుకులపై తండ్రి మోహన్ బాబు సీరియస్!

Kaburulu

Kaburulu Desk

March 24, 2023 | 03:30 PM

Manchu Family: తెరపైకి మంచు బ్రదర్స్ కొట్లాట వీడియో.. కొడుకులపై తండ్రి మోహన్ బాబు సీరియస్!

Manchu Family: సీనియర్ నటుడు, కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు ఇంట గొడవలు రచ్చకెక్కాయి. మంచు ఫ్యామిలీలో అన్నదమ్ములు మంచు విష్ణు, మంచి మనోజ్ మధ్య ఏవో డిఫరెన్స్ ఉన్నాయని కొద్దిరోజులుగా పుకార్లు షికారులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన మంచి మనోజ్ పెళ్ళికి కూడా విష్ణు చుట్టపు చూపుగా వచ్చి వెళ్లారని ప్రచారం జరిగింది. పెళ్లిలో అంతా మంచు లక్ష్మి హడావుడి కనిపించిందే తప్ప విష్ణు పెళ్లి టైం కి వచ్చి వెళ్ళిపోయారు. అప్పుడే చాలామందికి అనుమానాలు కలిగాయి.

కాగా, ఇప్పుడు ఆ గొడవలు రోడ్డున పడ్డాయి. తాజాగా అన్నదమ్ముల వివాదం సోషల్ మీడియాకి ఎక్కింది. మంచు మనోజ్ తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన వీడియోతో వీరి మధ్య విబేధాలు బహిర్గతమయ్యాయి. కొన్నాళ్లుగా సోదరులైన మంచు విష్ణు, మనోజ్ మధ్య విబేధాలున్నాయనే వార్తలకు ఈ వీడియో ఆద్యం పోసింది. మనోజ్ కు సన్నిహితంగా ఉండే సారధి అనే వ్యక్తి ఇంటికి వెళ్లి మంచు విష్ణు గొడవ పడుతున్న వీడియోను మనోజ్ పోస్ట్ చేశాడు.

సారధితో విష్ణు గొడవ పడుతున్న వీడియోను మనోజ్ స్టేటస్ గా పెట్టాడు. నావాళ్లపై విష్ణు ఇలా గొడవ పడుతున్నాడని మనోజ్ అంటున్నాడు. వీడియోలో.. ‘నా ఇష్టం.. వాడేదో అంటున్నాడు కదా’ అనే విష్ణు అంటున్నాడు. గురువారం రాత్రి గొడవ జరగడంతో శుక్రవారం ఉదయం మంచు మనోజ్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనిపై స్పందించిన మోహన్ బాబు వీడియోను డిలీట్ చేయమని చెప్పినట్లు తెలుస్తుంది. ఇంటి వివాదాన్ని సోషల్ మీడియా దాకా ఎందుకు తీసుకెళ్లారని మందలించినట్టుగా తెలుస్తోంది.

దాంతో పదిగంటలకు వీడియోను పోస్ట్ చేసిన మనోజ్ వెంటనే డిలీట్ కూడా చేశారు. అయితే, అప్పటికే ఈ వీడియో సోషల్ మీడియా మొత్తం పాకేసింది. ప్రస్తుతం అన్నదమ్ముల మధ్య వైరం హాట్ టాపిక్ గా మారింది. వీరిద్దరి మధ్య గొడవకు కారణాలు తెలియాల్సి ఉంది. దీనిపై తండ్రి మోహన్ బాబు, సోదరి లక్ష్మీ ప్రసన్న ఇంకా స్పందించలేదు. కాగా, మంచు బ్రదర్స్ గొడవ వీడియో మాత్రం ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది.