Manchu Vishnu Vs Manoj : ఈ గొడవ కేవలం ఆరంభం మాత్రమే.. మంచు విష్ణు సంచలన పోస్ట్..
మంచు మనోజ్ తో గొడవ పై స్పందిస్తూ మంచు విష్ణు సంచలన పోస్ట్. ఇది కేవలం ఆరంభం మాత్రమే అంటూ ఒక వీడియో పోస్ట్ చేశాడు.

Manchu Vishnu Vs Manoj : ఇటీవల మంచు కుటుంబంలో వివాదం రాచుకున్న సంగతి అందరికి తెలిసిందే. మంచు విష్ణు (Manchu Vishnu) అండ్ మనోజ్ (Manchu Manoj) గొడవ పడుతున్న ఒక వీడియో బయటకి రావడం, దానిని స్వయంగా మనోజ్ పోస్ట్ చేయడం టాలీవుడ్ తీవ్ర అలజడిని కలిగించింది. వీరిద్దరి మధ్య విబేధాలు చోటు చేసుకున్నాయి అంటూ ఎప్పటి నుంచో వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇక ఆ వీడియో బయటకి రావడంతో సోషల్ మీడియా, న్యూస్ ఛానల్స్ లో హాట్ టాపిక్ అయ్యిపోయింది. అయితే కొంత సమయానికి ఆ వీడియోని మోహన్ బాబు డిలీట్ చేయించాడు.
Manchu Vishnu Vs Manoj : మంచు బ్రదర్స్ మధ్య విబేధం.. కుటుంబసభ్యుల రియాక్షన్!
ఆ తరువాత కూడా మనోజ్ మరో పోస్ట్ కూడా వేశాడు. ‘కంటి ముందు తప్పు జరుగుతున్నా దానిని ప్రశించకుండా ఉండడం కంటే, ఎదురెళ్లి పోరాడి చావడానికైనా సిద్ధం’ అంటూ పోస్ట్ చేశాడు. తాజాగా మంచు విష్ణు కూడా ఒక సంచలన పోస్ట్ వేశాడు. హౌస్ అఫ్ మంచుస్ (House of Manchus) అంటూ ఒక వీడియో పోస్ట్ చేశాడు. ఆ వీడియోలో గొడవకి సంబంధించిన వీడియోతో మొదలుపెట్టి, న్యూస్ ఛానల్స్ లో వచ్చిన వార్తలని చూపించాడు. ఇక దాని గురించి మాట్లాడుతూ.. నా పేరు మంచు విష్ణు. మోహన్ బాబు గారి అబ్బాయిని అని చెప్పి తన భార్యపిల్లల విజువల్స్, మోహన్ బాబు విజువల్స్ చూపించాడు.
వీడియో చివరిలో ఇండియాస్ బిగ్గెస్ట్ రియాలిటీ షో.. హౌస్ అఫ్ మంచుస్ అంటూ అందర్నీ షాక్ కి గురి చేశాడు. అలాగే త్వరలో స్ట్రీమ్ కాబోతుంది అంటూ కూడా తెలియజేశాడు. ఇక ఈ వీడియో కింద.. ఇది కేవలం ఆరంభం మాత్రమే అంటూ కామెంట్ రాసుకొచ్చాడు. దీంతో అసలు ఈ గొడవ నిజామా? కాదా? అనే తికమకలో పడ్డారు అందరూ. ఇక కొంతంది నెటిజెన్లు మాత్రం.. ఇది కవర్ చేసుకుంటాకి చేస్తున్న ప్రయత్నం అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరి అసలు నిజమేంటో తెలియాలి అంటే ఎదురు చూడాల్సిందే.
View this post on Instagram