Manchu Manoj : మంచు మనోజ్, భూమా మౌనిక సహజీవనం చేస్తున్నారు.. మాజీ ఎమ్మెల్యే గోనె సంచలన వ్యాఖ్యలు..

Kaburulu

Kaburulu Desk

September 16, 2022 | 02:02 PM

Manchu Manoj : మంచు మనోజ్, భూమా మౌనిక సహజీవనం చేస్తున్నారు.. మాజీ ఎమ్మెల్యే గోనె సంచలన వ్యాఖ్యలు..

Manchu Manoj :  సినిమా సెలబ్రిటీలు పెళ్లిళ్లు చేస్కోవడం, విడాకులు తీసుకోవడం ఇప్పుడు చాలా కామన్ అయిపొయింది. ఒకప్పుడు బాలీవుడ్ లో ఉండే ఈ సంస్కృతి ఇప్పుడు టాలీవుడ్ దాకా పాకింది. అలా విడాకులు తీసుకున్న వారిలో మంచు మనోజ్ ఒకరు. 2015లో ప్రణతి రెడ్డితో వివాహం అవ్వగా 2019లో వీరిద్దరూ విడిపోయారు. అప్పట్నుంచి మంచు మనోజ్ కూడా సైలెంట్ గానే ఉంటూ తన పర్సనల్ విషయాలు గురించి ఎక్కడా మాట్లాడలేదు.

తాజాగా గత కొన్ని రోజుల నుంచి మంచు మనోజ్ రాజకీయ ఫ్యామిలీ అయిన భూమా కుటుంబ వారసురాలు భూమా మౌనికని పెళ్లి చేసుకోనున్నారని వార్తలు వస్తున్నాయి. వీరిద్దరూ దీనిగురించి ఇప్పటివరకు స్పందించలేదు. కానీ ఇటీవల వీరిద్దరూ కలిసి హైదరాబాద్ లోని ఓ వినాయక మండపం వద్దకు వెళ్లి పూజలు చేశారు. దీంతో వీరిద్దరూ కచ్చితంగా పెళ్లిచేసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి.

Alluri Trailer : హీరో అంటే పోలీస్.. ఫస్ట్ టైం పవర్‌ఫుల్ యాక్షన్‌తో వస్తున్న శ్రీ విష్ణు.. అల్లూరి ట్రైలర్ రిలీజ్..

తాజాగా మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా మనోజ్-మౌనిక బంధం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. గోనె ప్రకాష్ రావు మాట్లాడుతూ.. ”మోహన్ బాబు, భూమా కుటుంబానికి మంచి స్నేహం ఉంది. మనోజ్, మౌనిక గతంలోనే ప్రేమించుకున్నారు. కానీ అప్పుడు పెద్దలు ఒప్పుకోలేదు. వీరిద్దరికి వేరు వేరు పెళ్లిళ్లు అయి, ఆ తర్వాత ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం మనోజ్, మౌనిక సహజీవనం చేస్తున్నారు. పెళ్లి కూడా చేసుకుంటారు” అని అన్నారు. దీంతో ఈయన చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. వీరిద్దరి వెనుక ఇంత పెద్ద స్టోరీ ఉందా అని ఆశ్చర్యపోతున్నారు అంతా.