Ye Maya Chesave 2: చైతన్యతో ‘ఏ మాయ చేసావే 2’ చేస్తానంటున్న గౌతమ్ మీనన్.. మరి సమంత సంగతేంటి?

Kaburulu

Kaburulu Desk

September 16, 2022 | 02:25 PM

Ye Maya Chesave 2: చైతన్యతో ‘ఏ మాయ చేసావే 2’ చేస్తానంటున్న గౌతమ్ మీనన్.. మరి సమంత సంగతేంటి?

Ye Maya Chesave 2:  నాగచైతన్య, సమంత జంటగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన సినిమా ఏ మాయ చేసావే. ఈ సినిమా మంచి విజయం సాధించింది. అంతే కాకుండా ఇక్కడి నుంచే సమంత, చైతన్యల లవ్ స్టోరీ కూడా మొదలైంది. ఆ తర్వాత వాళ్ళు పెళ్లి చేసుకొని, విడిపోయారు కూడా. వారిద్దరూ కలిసి ఎన్ని సినిమాలు చేసినా ఈ సినిమా వాళ్లకి, అభిమానులకి కూడా స్పెషల్ సినిమా.

తాజాగా దర్శకుడు గౌతమ్ మీనన్ తన కొత్త సినిమా ప్రమోషన్స్ లో మాట్లాడుతూ తాను చేసిన కొన్ని సినిమాలకి సీక్వెల్స్ చేస్తానని తెలిపాడు. కమల్ హాసన్ తో రాఘవన్ 2, వెంకటేష్ తో ఘర్షణ 2, అలాగే నాగ చైతన్యతో ఏ మాయచేసావే 2 తీస్తానని ప్రకటించాడు. భవిష్యత్తులో ఈ ప్రాజెక్టులు ఆ హీరోలతోనే ఉంటాయన్నారు. దీంతో ఇప్పుడు సినీ ప్రేక్షకులకి కొత్త డౌట్ మొదలైంది.

Manchu Manoj : మంచు మనోజ్, భూమా మౌనిక సహజీవనం చేస్తున్నారు.. మాజీ ఎమ్మెల్యే గోనె సంచలన వ్యాఖ్యలు..

నాగచైతన్యతో ఏ మాయ చేసావే 2 తీస్తే మరి హీరోయిన్ గా ఎవర్ని పెడతారు?. ఒకవేళ పార్ట్ 2లో కూడా సమంతనే పెడదామనుకున్నా సమంత ఒప్పుకుంటుందా?. విడాకుల తర్వాత చైతూ సమంత గురించి మాట్లాడినా సాఫ్ట్ కార్నర్ తోనే మాట్లాడాడు. సినిమాలు చేయాల్సి వస్తే చేస్తాను అని కూడా అన్నాడు. కానీ సమంత మాత్రం చైతూని కొడతాను, పొడుస్తాను అని ఇండైరెక్ట్ గా సీరియస్ గానే మాట్లాడింది. మరి సమంతకి ఒకవేళ ఏ మాయ చేసావే 2 సినిమా ఆఫర్ చేస్తే ఒప్పుకుంటుందా? ఒప్పుకోకపోతే ఏ హీరోయిన్ సమంత ప్లేస్ ని రీప్లేస్ చేస్తుందో చూడాలి మరి.