Alluri Trailer : హీరో అంటే పోలీస్.. ఫస్ట్ టైం పవర్‌ఫుల్ యాక్షన్‌తో వస్తున్న శ్రీ విష్ణు.. అల్లూరి ట్రైలర్ రిలీజ్..

Kaburulu

Kaburulu Desk

September 16, 2022 | 01:28 PM

Alluri Trailer : హీరో అంటే పోలీస్.. ఫస్ట్ టైం పవర్‌ఫుల్ యాక్షన్‌తో వస్తున్న శ్రీ విష్ణు.. అల్లూరి ట్రైలర్ రిలీజ్..

Alluri Trailer :  గతంలో చాలా మంచి మంచి సినిమాలతో మెప్పించిన శ్రీ విష్ణు గత కొంతకాలం నుంచి సరైన విజయం కోసం ఎదురు చూస్తున్నాడు. కొన్ని రోజులుగా వరుస ఫ్లాప్స్ చూస్తున్నాడు. ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని మొదటి సారి ఫుల్ యాక్షన్ సినిమా ‘అల్లూరి’తో త్వరలో రానున్నాడు శ్రీవిష్ణు. ఇప్పటికే టీజర్ రిలీజ్ చేయగా తాజాగా ట్రైలర్ ని లాంచ్ చేశారు. హీరో నాని చేతుల మీదుగా అల్లూరి ట్రైలర్ ని లాంచ్ చేశారు.

ట్రైలర్ ఆద్యంతం ఫుల్ మాస్ యాక్షన్ సీక్వెన్స్ లతో ఉంది. పోలీస్ పవర్ ని చూపించారు. పవర్ ఫుల్ డైలాగ్స్ చెప్పించారు. విలన్ ని ఎదుర్కోడానికి, అతనికి సపోర్ట్ చేసేవాళ్ళని ఢీ కొట్టడానికి వెళ్లే హీరోలా శ్రీ విష్ణుని చూపించారు. మధ్యలో ఓ లవ్ స్టోరీని కూడా పెట్టారు. కానీ హీరో పవర్‌ఫుల్ పోలీస్ అవ్వడంతో హీరో ఫ్యామిలీపై కూడా అటాక్ జరిగితే తన భార్య వదిలేసి వెళ్తుంది. ట్రైలర్ లో సినిమా కథ ఏంటి అని చెప్పకుండా జాగ్రత్త పడ్డాడు డైరెక్టర్.

Dongalunnaru Jaagratha Trailer : కారులో ఇరుక్కున్న హీరో.. కారులో బాంబ్.. దొంగలున్నారు జాగ్రత్త ట్రైలర్ రిలీజ్..

ఈ సినిమా కోసం శ్రీ విష్ణు చాలా చేంజ్ అయినట్టు తెలుస్తుంది. ప్రదీప్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని బెక్కెం వేణుగోపాల్ నిర్మించారు. అల్లూరి సినిమా సెప్టెంబర్ 23న రిలీజ్ కానుంది.