Manchu Manoj : నేను బాధల్లో ఉన్నప్పుడు నా జీవితంలోకి వెలుతురులా వచ్చింది మౌనిక..

ఇటీవల మార్చ్ 3న భూమా మౌనికను మనోజ్ రెండో పెళ్లి చేసుకున్నాడు. వీరి వివాహం అనంతరం మౌనిక సొంతూరు ఆళ్లగడ్డకు వెళ్ళాడు మనోజ్. ఆ తర్వాత మళ్ళీ వీరిద్దరూ బయట కనిపించలేదు. ఇటీవల మోహన్ బాబు యూనివర్సిటీ 31వ వార్షికోత్సవం జరగగా మంచు ఫ్యామిలీ అంతా ఈ ఈవెంట్ కి వచ్చారు. మనోజ్ తో భూమా మౌనిక కూడా.................

Kaburulu

Kaburulu Desk

March 22, 2023 | 03:27 PM

Manchu Manoj : నేను బాధల్లో ఉన్నప్పుడు నా జీవితంలోకి వెలుతురులా వచ్చింది మౌనిక..

Manchu Manoj :  మంచు మనోజ్ గత కొన్నాళ్ల నుంచి సినిమాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. కొన్ని నెలలుగా మంచు మనోజ్, భూమా మౌనిక పెళ్లి చేసుకుంటారు అనే వార్తలు రాగా ఇటీవల మార్చ్ 3న భూమా మౌనికను మనోజ్ రెండో పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరికీ రెండో వివాహం కావడంతో కేవలం కుటుంబ సభ్యుల మధ్య మోహన్ బాబు ఇంట్లోనే వీరి వివాహం జరిగింది. దీంతో మంచు మనోజ్ భూమా మౌనిక కొన్ని రోజులు వైరల్ గా మారారు.

వీరి వివాహం అనంతరం మౌనిక సొంతూరు ఆళ్లగడ్డకు వెళ్ళాడు మనోజ్. ఆ తర్వాత మళ్ళీ వీరిద్దరూ బయట కనిపించలేదు. ఇటీవల మోహన్ బాబు యూనివర్సిటీ 31వ వార్షికోత్సవం జరగగా మంచు ఫ్యామిలీ అంతా ఈ ఈవెంట్ కి వచ్చారు. మనోజ్ తో భూమా మౌనిక కూడా వచ్చింది. స్టేజిపై మనోజ్ మాట్లాడుతూ మౌనిక విషయాన్ని కూడా ప్రస్తావించడంతో మనోజ్ స్పీచ్ వైరల్ గా మారింది.

Anasuya : మాట్లాడుతూ మీడియా ముందు ఏడ్చేసిన అనసూయ..

మనోజ్ మాట్లాడుతూ.. మా నాన్నే మాకు స్ఫూర్తి. మా నాన్న ఎన్నో కష్టాలు అనుభవించి ఈ స్థాయిలో ఉన్నారు. చిన్నప్పటి నుంచి నేను ఎన్నోసార్లు ఆయనను ఇబ్బంది పెట్టాను. కానీ నా మీద ప్రేమ మాత్రం మా నాన్నకు తగ్గలేదు. మన అందరం ఏదో ఒక దశలో బాధలు ఎదుర్కొంటాం, ఇబ్బందులు పడతాం. మా నాన్న అలా పడే పైకి వచ్చారు. నేను కూడా అలా బాధల్లో ఉన్నప్పుడే నా జీవితంలోకి మౌనిక ఒక వెలుతురిలా వచ్చింది. నాకు సపోర్ట్ గా నిలిచింది. తాను ఏం చేయాలనుకున్నా నేను అండగా ఉంటాను. మా నాన్నకు చెప్పాను తనకి మాట ఇచ్చాను అని, మా నాన్న నా ఇష్టాన్ని గౌరవించారు అని చెప్పడంతో స్టేజి ముందు ఉన్న మౌనిక ఎమోషనల్ అయింది.