Manchu Vishnu Vs Manoj : మంచు బ్రదర్స్ మధ్య విబేధం.. కుటుంబసభ్యుల రియాక్షన్!
మంచు మనోజ్ అండ్ విష్ణు గొడవపడిన వీడియో బయటకి రావడంతో టాలీవుడ్ లో తీవ్ర దుమారం రేపింది. దీని పై మోహన్ బాబు ఇద్దరికీ సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు.

Manchu Vishnu Vs Manoj : మంచు కుటుంబంలో వివాదం రాచుకుంది. కొంత కాలంగా మంచు బ్రదర్స్ విష్ణు (Manchu Vishnu) అండ్ మనోజ్ (Manchu Manoj) మధ్య విబేధాలు చోటు చేసుకున్నాయని వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇటీవల మనోజ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయ కుటుంబానికి చెందిన భూమా మౌనికని రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ వివాహానికి కూడా మంచు విష్ణు హాజరు కాకపోవడంతో.. విబేధాలు వార్తలు నిజమనే ఊహాగానాలు ఇంకొంచెం ఎక్కువ అయ్యాయి. ఇక ఇది ఇలా ఉంటే, ఈరోజు (మార్చి 24) ఉదయం విష్ణు తన పై దాడి చేస్తున్నాడు అంటూ పోస్ట్ చేసిన వీడియో టాలీవుడ్ తీవ్ర దుమారం రేపింది.
Kushi : ఖుషి రిలీజ్ రెడీ.. విజయ్ దేవరకొండ, సమంత సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్..
ఆ వీడియోలో మంచు విష్ణు, మనోజ్ అనుచరుడు సారథి ఇంటికి వచ్చి గొడవ చేస్తున్న దృశ్యం కనిపిస్తుంది. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం, మీడియాలో హాట్ టాపిక్ అవ్వడంతో మోహన్ బాబు రంగంలోకి దిగి.. ఇద్దరి కొడుకులకు నచ్చచెప్పాడు. చిన్న సమస్యని పెద్దది చేయకండి అంటూ మనోజ్ చేత ఆ వీడియోని డిలీట్ చేయించాడు. ఈ విషయం పై మోహన్ బాబు (Mohan Babu) భార్య మంచు నిర్మల కూడా రెస్పాండ్ అయ్యింది. “మా అబ్బాయిల మధ్య ఎలాంటి గొడవలు లేవు” అంటూ ఆమె వెల్లడించింది.
ఇక ఈ గొడవ గురించి మంచు లక్ష్మిని (Manchu Lakshmi) ప్రశ్నించగా.. నాకు అసలు ఈ గొడవ గురించే తెలియదు. ఈ రోజు మా ఇంట్లో స్నేహితులతో లంచ్ ప్రోగ్రామ్ ఉంది. నేను ఆ పనిలో బిజీగా ఉన్నాను. కాబట్టి దాని గురించి తెలియకుండా నేను ఏమి మాట్లాడను అని బదులిచ్చింది. కాగా అసలు మంచు బ్రదర్స్ మధ్య ఈ విబేధాలకు గల కారణం ఏంటనేది తెలియలేదు. అయితే ఇటీవల సోషల్ మీడియాలో ఒక వార్త హల్ చల్ చేసింది. అదేంటంటే మనోజ్, భూమా మౌనికని పెళ్లి చేసుకోవడం విష్ణుకి ఇష్టం లేదని వార్త బాగా వైరల్ అయ్యింది.