Telangana Women’s Day Awards: రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారాలను ప్రకటించిన ప్రభుత్వం!

Telangana Women’s Day Awards: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం మహిళలకు కానుకలు అందిస్తున్నది. ఇప్పటికే మార్చి 8వ తేదీన సాధారణ సెలవుగా ప్రకటించిన ప్రభుత్వం.. అదే రోజు దాదాపు రూ.750 కోట్ల రుణాలు స్వయం సహాయక సంఘాలకు అందించనుంది. ఇక మహిళలను సత్కరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ ప్రభుత్వం అవార్డులు ప్రకటించింది.
ఈ తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారాలకు 27మందిని ఎంపిక చేసింది. ఈమేరకు సీఎస్ భారతి హోళీకేరి ఉత్తర్వులు జారీ చేశారు. 27 మంది మహిళలకు అవార్డుతో పాటు రూ.లక్ష చొప్పున నగదు పురస్కారం అందజేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. పురస్కారానికి ఎంపికైన వారిలో పోలీసులు, అంగన్వాడీ టీచర్లు, సామాజిక కార్యకర్తలతో పాటు వివిధ రంగాలకు చెందిన వారు కూడా ఉన్నారు.
అవార్డులు పొందిన మహిళలు వీరే..
బానోతు జ్యోతి – అంగన్వాడీ టీచర్
గుండా రాజకుమారి – సెంటర్ కోఆర్డినేటర్, భరోసా సెంటర్
ఆల్ఫి కిండన్జెన్ – సోషల్ సర్వీస్
మీనాక్షి గాడ్గె – ముఖ్రా కే సర్పంచ్
సుజాత దీక్షిత్ – థియేటర్
స్వరూప పొట్లపల్లి – జర్నలిజం
డాక్టర్ బండారు సుజాత శేఖర్ – ఫోక్ లిటరేచర్
అరుణ నారదభట్ల – లిటరేచర్
డాక్టర్ అమూల్య మల్లన్నగారి – హెల్త్
నారా విజయలక్ష్మి(పీహెచ్) – పెయింటర్
ఓఎన్ఐ సిస్టర్స్(వినోద, విజయ, విజయలక్ష్మి) – మ్యూజిక్
రుక్మిణి, ఇన్స్పెక్టర్ – షీ టీమ్స్ భరోసా సెంటర్
అనసూయ, ఐపీఎస్, డీసీపీ – పోలీసు డిపార్ట్మెంట్
అన్వితా రెడ్డి – మౌంటెయినర్
త్రిష గొంగడి – స్పోర్ట్స్(అండర్ -19 క్రికెటర్)
డాక్టర్ అనురాధ తడకమళ్ల – క్లాసికల్ డ్యాన్స్
దంటు కనకదుర్గ – సోషల్ యాక్టివిస్ట్
డాక్టర్ మాలతి – హెల్త్, సూపరింటెండెంట్, ఎంజీఎంహెచ్, పేట్లబుర్జ్
సమంత రెడ్డి – వుమెన్ ఎంటర్ప్రెన్యూర్
కర్నె శంకరమ్మ – కిన్నెర, ఫోక్
డాక్టర్ గుడూరు మనోజ – ఆద్య కళ
సామళ్ల శ్వేత – కమ్యూనిటీ మొబిలైజేషన్
జి. నందిని – సూపర్వైజర్, నిజామాబాద్(అ) ప్రాజెక్ట్
రజియా సుల్తానా – ఏడబ్ల్యూహెచ్, కౌడిపల్లి, ఐసీడీఎస్ – నర్సాపూర్
ఎం. కృష్ణవేణి – ఆశా వర్కర్
ఇందిర – ఏఎన్ఎం
డాక్టర్ కే రాణి ప్రసాద్ – లిటరేచర్