Ugadi: రాష్ట్ర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర ముఖ్యమంత్రి సిఎం కెసిఆర్, గవర్నర్ తమిళిసై

Kaburulu

Kaburulu Desk

March 22, 2023 | 06:16 PM

Ugadi: రాష్ట్ర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర ముఖ్యమంత్రి సిఎం కెసిఆర్, గవర్నర్ తమిళిసై

తెలుగువారి నూతన సంవత్సరం, తెలుగువారు జరుపుకునే మొదటి పండగల్లో ఒకటి ఉగాది. తెలుగు సంవత్సరాది అని కూడా అంటారు. హిందూ చాంద్రమాన క్యాలెండర్ ప్రకారం చైత్ర మాసం మొదటి రోజున జరుపుకునే పండగ ఉగాది. శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాదిని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు అత్యంత ఘనంగా జరుపుకుంటున్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ‘శ్రీ శోభకృత్‌’ నామ ఉగాది పండుగ శుభాకాంక్షలను చెప్పారు. తెలంగాణ సాధించిన ప్రగతి దేశానికే ఆదర్శంగా నిలిచిందని స్పష్టంచేశారు. ఉగాది పండగ అన్నదాతలకు, అన్ని రంగాల్లోని వారికీ, రాష్ట్ర ప్రజలకు శుభాలను కలుగజేయాలని కేసీఆర్ కోరుకున్నారు. శ్రీ శోభకృత్‌ సంవత్సరాన్ని వ్యవసాయ సంవత్సరంగా రైతులకు సకల శుభాలను చేకూర్చాలని సూచించారు.

వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడం ద్వారా దాని అనుబంధ రంగాలు, వృత్తులు బలపడి తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్ఠమైనదని సీఎం కేసీఆర్‌ తెలిపారు. రాష్ట్రంలో తాగునీరు, సాగు నీరు, పచ్చని పంటలతో నిత్య వసంతం నెలకొన్నదని పేర్కొన్నారు. ‘శోభకృత్‌’ నామ సంవత్సరంలో తెలంగాణతో పాటు భారతదేశం మరింత గొప్పగా అభివృద్ధి సాధించాలని సీఎం కేసీఆర్‌ కోరుకున్నారు