Uttar Pradesh: పెళ్ళైన మహిళతో యువకుడి అఫైర్.. అర్ధరాత్రి రెడ్ హ్యాండెడ్‌గా దొరికితే కట్ చేసి పంపారు!

Kaburulu

Kaburulu Desk

March 26, 2023 | 10:41 AM

Uttar Pradesh: పెళ్ళైన మహిళతో యువకుడి అఫైర్.. అర్ధరాత్రి రెడ్ హ్యాండెడ్‌గా దొరికితే కట్ చేసి పంపారు!

Uttar Pradesh: సమాజంలో వివాహేతర సంబంధాలు ఎక్కువై పోతున్నాయి. రోజూ జరిగే సగం నేరాలు హత్యలు, ఆత్మహత్యలలో ఈ అక్రమ సంబంధాల తాలూకూవే ఉంటున్నాయి. వివాహితులు, అవివాహితులు అనే బేధం లేకుండా మొదలవుతున్న ఈ పక్క చూపులు చివరికి కాపురాలు నాశనం చేస్తున్నాయి. మరికొన్ని విషాదాంతంగా ముగుస్తున్నాయి. ఇందులో యుక్త వయసులోని యువకులు ఎక్కువగా బలవుతున్నారు. ఈ ఘటన కూడా అలాంటిదే.

ఉత్తరప్రదేశ్‌, సోన్‌భద్ర జిల్లా పరిధిలోని సలైయాదీ గ్రామానికి చెందిన అనిల్ అనే యువకుడు హరియాణాలో ఉద్యోగం చేస్తున్నాడు. అక్కడే అతడికి ఝార్ఖండ్‌లోని గఢ్వా ప్రాంతానికి చెందిన వివాహితతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా అక్రమ సంబంధానికి దారితీసింది. దీంతో ఇద్దరూ కలిసి హరియాణాలో ఓ గది అద్దెకు తీసుకుని కాపురం పెట్టాడు. అయితే, మహిళ అత్తింటివారు మిస్సింగ్ కేసు పెట్టడంతో పోలీసులు ఆమెను తిరిగి భర్తకు అప్పగించారు.

ఆ తర్వాత కొన్నాళ్ళు మౌనంగానే ఉన్న వీరిద్దరూ కాస్త పాతపడిన అనంతరం మళ్ళీ కలవడం మొదలుపెట్టారు. ఈసారి మహిళ ఇంట్లోనే కాపురం పెడుతున్నారు. గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఈ వ్యవహారం ఒకరోజు మహిళ కుటుంబసభ్యుల కంటపడింది. ఆదివారం రాత్రి ప్రియురాలిని కలిసేందుకు వచ్చిన అనిల్‌ను కాపుకాసి పట్టుకుని ఓ స్తంభానికి కట్టేసి చితగొట్టారు. ఆపై కత్తితో అతడి నాలుకను కట్ చేసి వదిలేశారు. అక్కడ నుండి యువకుడు ఇంటికి చేరుకోగా.. నోటి నుంచి రక్తం ధారాళంగా కారుతుండడంతో యువకుడిని కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.

అక్కడ వైద్యులు యువకుడి నాలుకకు కుట్లు వేసి అతికించగా ప్రస్తుతం అతడు ఆస్పత్రిలో కోలుకుంటున్నాడు. ఈ విషయంపై జిల్లా చీఫ్ మెడికల్ ఆఫీసర్ అనూప్ సిన్హా మాట్లాడుతూ.. ‘ఆదివారం రాత్రి యువకుడు ఆస్పత్రిలో చేరగా.. అతడి నాలుకను 2 నుంచి 3 అంగుళాలు మేర కత్తిరించి ఉందని.. శస్త్రచికిత్స చేసి నాలుకకు కుట్లు వేశామని.. ప్రస్తుతం యువకుడి ఆరోగ్యం నిలకడగా ఉందని.. కాకపోతే మాట్లాడడానికి మరింత సమయం పడుతుందని తెలిపారు. యువకుడి తండ్రి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.