Coimbatore: భర్త ఉండగానే బిజినెస్‌మెన్‌తో ఎఫైర్.. లేడీ కిలాడీ టీచర్ నిజస్వరూపం తెలిస్తే షాకే!

Kaburulu

Kaburulu Desk

March 26, 2023 | 04:30 PM

Coimbatore: భర్త ఉండగానే బిజినెస్‌మెన్‌తో ఎఫైర్.. లేడీ కిలాడీ టీచర్ నిజస్వరూపం తెలిస్తే షాకే!

Coimbatore: ఆమె చేసేది గౌరవప్రదమైన టీచర్ ఉద్యోగం. స్కూల్ కి వెళ్లేప్పుడు పద్ధతిగా ఒద్దికగా వెళ్తుంది. కానీ.. ఆమె బుద్ది మాత్రం కన్నింగ్ కి కేరాఫ్ అడ్రస్. వృత్తి టీచర్ అయినా ప్రవృత్తి మాత్రం అందంతో మగాళ్లని ముగ్గులోకి దింపు అందిన వరకు గుంజడం.. తేడా వస్తే బ్లాక్ మెయిల్ చేయడం.. మరీ తేడా వస్తే చంపేస్తానని బెదిరించడం. పెళ్ళై భర్త, ఇద్దరు పిల్లలు ఉండగానే ఈ మేడం ఓ బిజినెస్ మెన్ ను వలలో వేసుకొని అతన్ని పీల్చి పిప్పి చేసి వదిలేయగా.. అతను రివర్స్ అవడంతో టీచర్ బండారం బయటపడింది.

ఈ టీచర్‌ పేరు హాజిల్‌ జేమ్స్‌. కోయంబత్తూరు స్వస్థలం. ఈమెకు వివాహం అయ్యి ఇద్దరు కుమార్తెలు ఉండగా సోషల్‌ మీడియాలో ఫుల్‌ యాక్టీవ్‌ ఉంటుంది. ఎప్పటికప్పుడు మోడ్రన్‌ డ్రెస్సులలో రచ్చ చేస్తూ యువకులకు గాలిమేస్తుంది. ఆమెకు 2020లో ముంబైకి చెందిన వ్యాపారవేత్త రాజేష్‌తో పరిచయం ఏర్పడింది. అతడు సెంబూరు రైల్వే స్టేషన్‌లో ఓ ట్రావెల్‌ కంపెనీ నడిపేవాడు. ఇద్దరి మధ్య పరిచయం పెరిగి.. మంచి స్నేహితులయ్యారు.

ప్రారంభంలో తనకు వివాహం కాలేదని రాజేష్‌కు చెప్పిన హాజిల్‌.. కొన్నాళ్లకు తన భర్త మృతి చెందాడని చెప్పింది. ఆ తర్వాత కొన్నాళ్ళకు తన భర్త ఉన్నాడని.. కానీ అతడి నుంచి విడిపోయానని, ప్రస్తుతం కోర్టులో కేసు నడుస్తోందని చెప్పింది. అప్పటికే హాజిల్‌ మత్తులో మునిగిపోయిన రాజేష్‌ ఆమెను ఆదుకుంటాను అని మాటిచ్చాడు. చెప్పినట్లే మూడేళ్లలో మొత్తం 20 లక్షల నగదు, విలువైన ఫోన్లు, సామాన్లు కొనుగోలు వరకు గుంజేసింది. ఇంతలో హాజిల్‌ నిజ స్వరూపం రాజేష్‌కి తెలిసింది.

ఆమె ఓ ఆర్మీ అధికారితో రిలేషన్‌లో ఉందని రాజేష్ గుర్తించాడు. దీంతో ఆరా తీయగా హాజిల్‌కు చాలా మంది మగాళ్లతో సంబంధం ఉందని వెల్లడయ్యింది. ఇదేంటని ప్రశ్నిస్తే నా వ్యక్తిగత వ్యవహారంలో జోక్యం చేసుకోవడానికి నువ్వు ఎవరని ప్రశ్నించింది. దాంతో రాజేష్‌ ఆమెతో బంధానికి స్వస్థి పలికి డబ్బులు తిరిగి ఇవ్వమంటే.. తాను, తన ఇద్దరూ బిడ్డలు ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించింది. మళ్ళీ అడిగితే రివర్స్ లో రాజేష్ ను లేపేస్తానని బెదిరించింది.

రాజేశ్‌ చివరికి పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులకు సంచలన విషయాలు తెలిశాయి. హాజిల్‌ ఓ పోలీసు అధికారి కొడుకును ప్రేమ వివాహం చేసుకోగా ఇద్దరు పిల్లలున్నారు. ఇద్దరికి పడక వేరుగా ఉంటున్నారు. ప్రస్తుతం వీరి విడాకులు కేసు కోర్టులో ఉండగా.. హాజిల్‌ ప్రస్తుతం ఓ ఆర్మీ అధికారితో రిలేషన్‌లో ఉంది. త్వరలోనే పెళ్లి చేసుకోవాలని భావిస్తోంది. మొదటి భర్తను హత్య చేసేందుకు ప్లాన్‌ చేసినట్లు తెలిసి ఆమె మీద పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.