Hyderabad: అమ్మాయిలతో నగ్న నృత్యాలు, వ్యభిచారం.. ముజ్రా పార్టీని గుట్టురట్టు చేసిన ఎస్ఓటీ పోలీసులు

Hyderabad: రోజు రోజుకీ మన సమాజంలో పెరిగిపోతున్న అఘాయిత్యాలు ఆందోళనకరంగా మారుతున్నా..అసాంఘిక కార్యకపాలకు మాత్రం కొదువే లేకుండా పోతుంది. అమ్మాయిలతో గలీజ్ దందా చేయిస్తున్న ఘటన నగరంలో కలకలం రేపుతోంది. కేటుగాళ్లు పోలీసుల కల్లు గప్పి వారిపని వారు చేసుకుంటూ పోతున్నారు. నగ్నంగా డ్యాన్సులు, వ్యభిచారం చేయిస్తూ డబ్బులు మూటగట్టుకుంటున్నారు. గంజాయి మత్తుకు యువతను బానిసలుగా చేస్తూ తమ గల్లాలు నింపుకుంటున్నారు.
ఇప్పటికే వీకెండ్ వస్తే చాలు బార్లు, పబ్బులు యువతను రారమ్మంటుంటే.. ముజ్రా పార్టీల పేరిట కొందరు యువతకు గాలమేసి సిటీ చివర్లలో రచ్చ రచ్చ చేస్తున్నారు. తాజాగా రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పరిధిలోని ఫాం హౌస్ లలో యువతులతో నగ్నంగా నృత్యాలు చేస్తూ వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు ఎస్ఓటీ పోలీసులు. మొయినాబాద్ పరిధిలో ముజ్రా పార్టీలతో వ్యభిచార దందా సాగుతున్న విషయమై సమాచారం అందడంతో ఎస్ఓటీ పోలీసులు దాడులు చేశారు.
మొయినాబాద్ పరిధిలోని మొత్తం నాలుగు ఫాంహౌస్ లలో హుక్కా సేవిస్తూ అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. గతంలో కూడా హైద్రాబాద్ నగర శివారులోని ఫాంహౌస్ లలో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్న అంశంపై పోలీసులు కేసు నమోదు చేశారని ఓ ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ కథనాలు ప్రసారం చేసింది. దీంతో ఈ ఏడాది ఫిబ్రవరి 17న హైద్రాబాద్ శివారులో గల 15 ఫాం హౌస్ లపై పోలీసులు నమోదు చేశారు.
ఇప్పుడు తాజాగా హైదరాబాద్ శం షాబాద్ మొయినాబాద్ పరిధిలో ముజ్రా పార్టీల పేరుతో గలీజ్ దందా వెలుగులోకి వచ్చింది. అమ్మాయిలతో నగ్నంగా నృత్యాలు చేయిస్తూ వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్రియేషన్ ఫామ్ హౌస్, మ్యాంగో వుడ్ ఫామ్ హౌస్, కుషీ కర్తీ ఫామ్ తో పాటు బ్రౌన్ టౌన్ ఫామ్ హౌజ్ లో నిబంధనలకు విరుద్ధంగా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు కేసులు నమోదు చేశారు.