Headache : తలనొప్పి తొందరగా తగ్గడానికి అద్భుతమైన చిట్కా..
సాధారణంగా అందరూ ఏదో ఒక సమయంలో ఎదుర్కునే సమస్య తలనొప్పి. అయితే ఎక్కువసేపు దేని గురించి అయినా ఆలోచించినా లేకపోతే ఎక్కువ సౌండ్స్ విన్నా కూడా తలనొప్పి వస్తుంది. కారణం ఏదయినా తలనొప్పి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దానిని.............

Headache : సాధారణంగా అందరూ ఏదో ఒక సమయంలో ఎదుర్కునే సమస్య తలనొప్పి. అయితే ఎక్కువసేపు దేని గురించి అయినా ఆలోచించినా లేకపోతే ఎక్కువ సౌండ్స్ విన్నా కూడా తలనొప్పి వస్తుంది. కారణం ఏదయినా తలనొప్పి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దానిని తగ్గించుకోవడానికి పెయిన్ కిల్లర్స్, టాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు. కానీ అలా కాకుండా న్యాచురల్ పద్దతిలో తలనొప్పిని తగ్గించుకోవచ్చు.
మనం ఆవిరి పట్టుకుంటే తొందరగా తలనొప్పి తగ్గుతుంది. అల్లం మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. అదేవిధంగా తలనొప్పిని తగ్గించుకోవడానికి కూడా అల్లం ఉపయోగపడుతుంది. ఆవిరి పట్టుకోవడానికి ముందుగా నీటిలో అల్లం పొడిని లేదా అల్లం పేస్ట్ ని ఉంచి కాసేపు మరిగించాలి. ఆ నీరు ఘాటుగా ఉంటుంది. అయినప్పటికీ ఆ నీటితో మనం ఐదు నిముషాలు ఆవిరి పట్టుకుంటే ఎలాంటి తలనొప్పి అయినా తొందరగా తగ్గుతుంది. ఇంకా మనకు జలుబు, దగ్గు వంటివి వచ్చిన కూడా తగ్గుతాయి.
Re Usage of Tea Bags : తాగి పడేసిన టీ బ్యాగ్‌తో కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయి తెలుసా..?
అలాగే పుదీనా ఆకులతో కూడా ఆవిరి పెట్టుకోవచ్చు. దాని వలన కూడా తలనొప్పి తగ్గుతుంది. అందుకోసం మొదట గుప్పెడు పుదీనా ఆకులని నీటిలో వేసి వాటిని బాగా మరిగించాలి. ఆ తరువాత ఆ నీటితో ఐదు నిముషాల పాటు ఆవిరి పట్టుకోవాలి. ఇలా చేయడం వలన తలనొప్పి తగ్గుతుంది. ఇంకా మైండ్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. మానసికంగా ఒత్తిడి, ఆందోళనలు ఉన్న పుదీనా ఆకులతో ఆవిరి పట్టడం వలన తగ్గుతాయి. కాబట్టి తలనొప్పి వచ్చినప్పుడు పెయిన్ కిల్లర్స్, టాబ్లెట్స్ వంటివి వాడకుండా ముందుగా ఆవిరి పట్టే పద్దతిని పాటించండి. దీని వలన మనకు ఎంతో ప్రశాంతంగా కూడా ఉంటుంది.