Relationship : లైఫ్ పార్టనర్ తో బంధాన్ని ఇలా గట్టిపరుచుకోండి..

మనిషి అన్న తర్వాత అందరిలో ఏవో ఒకటి కొన్ని లోపాలు ఉంటాయి. కానీ భాగస్వామి అయిన తరువాత మన భాగస్వామి లోపాలను కూడా మన్నించగలగాలి. ఎప్పుడూ వారి తప్పులను ఎత్తి చూపకూడదు. కానీ..........

Kaburulu

Kaburulu Desk

January 8, 2023 | 08:30 PM

Relationship : లైఫ్ పార్టనర్ తో బంధాన్ని ఇలా గట్టిపరుచుకోండి..

Relationship :  మనిషి అన్న తర్వాత అందరిలో ఏవో ఒకటి కొన్ని లోపాలు ఉంటాయి. కానీ భాగస్వామి అయిన తరువాత మన భాగస్వామి లోపాలను కూడా మన్నించగలగాలి. ఎప్పుడూ వారి తప్పులను ఎత్తి చూపకూడదు. కానీ ఆ తప్పు ఎలా జరిగింది, ఎందుకు అలా జరుగుతుంది అని అడగాలి, నెమ్మదిగా తెలుసుకోవాలి. అంతేకాని తప్పుల గురించి పదే పదే అడిగి విసిగించకూడదు. పదే పదే అడగడం వలన వారికి బంధం మీద అసంతృప్తి ఏర్పడుతుంది. అది బంధానికి చాలా హానికరం.

ఏదయినా తప్పు, సమస్య జరిగినప్పుడు ఇంకోసారి అలా జరగకుండా చూసుకోవాలి. దానికి ఫిర్యాదుకు బదులుగా మన భాగస్వామిని సలహా అడగాలి. ఏదయినా తప్పు జరిగినప్పుడు వారిని కోపంగా కాకుండా ముందుగా వారికి సమాధానం చెప్పే అవకాశం ఇవ్వాలి. ఎప్పుడూ మన వైపు నుంచి ఆలోచిస్తూ ఉంటాము కానీ అవతలి వారి వైపు కూడా ఆలోచించాలి వారు చెప్పేది వినాలి.

Headache : తలనొప్పి తొందరగా తగ్గడానికి అద్భుతమైన చిట్కా..

భార్యాభర్తల్లో కోపంగా ఉన్నప్పుడు ఎక్కువగా మాట్లాడకపోవడం మంచిది లేకపోతే భాగస్వామి మనసు నొచ్చుకునేలా మాట్లాడుతాము అలా చేయడం వలన బంధం బీటలు వారుతుంది. కోపాన్ని తగ్గించుకోవడానికి కాసేపు ధ్యానం చేస్తే మంచిది. దీని వలన మనసు ప్రశాంతంగా మారుతుంది. అదేవిధంగా క్షమాపణ చెప్పడం మరియు క్షమించగలగడం రావాలి. మన తప్పు లేకపోయినా క్షమాపణ చెప్పగలగాలి. అప్పుడే మీకు మీ భాగస్వామితో ఎంతో ప్రేమ మరియు బంధాన్ని నిలుపుకోగలుగుతారు.