Re Usage of Tea Bags : తాగి పడేసిన టీ బ్యాగ్‌తో కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయి తెలుసా..?

చాలా వరకు అందరూ టీ తయారుచేయడానికి టీ పొడిని వాడుతున్నారు. కానీ ఇప్పుడు టీ బ్యాగ్స్ వాడకం పెరిగింది. దానితో మరగపెట్టే సమయం లేకుండా వేడి నీళ్లు లేదా పాలల్లో టీ బ్యాగ్ వేసుకొని తాగేస్తున్నారు. అయితే చాలామంది టీ బ్యాగ్స్ ని వాడి డస్ట్ బిన్ లో పడేస్తున్నారు. కానీ వాడేసిన టీ బ్యాగ్స్ ని..............

Kaburulu

Kaburulu Desk

January 7, 2023 | 05:00 PM

Re Usage of Tea Bags : తాగి పడేసిన టీ బ్యాగ్‌తో కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయి తెలుసా..?

Re Usage of Tea Bags :  చాలా వరకు అందరూ టీ తయారుచేయడానికి టీ పొడిని వాడుతున్నారు. కానీ ఇప్పుడు టీ బ్యాగ్స్ వాడకం పెరిగింది. దానితో మరగపెట్టే సమయం లేకుండా వేడి నీళ్లు లేదా పాలల్లో టీ బ్యాగ్ వేసుకొని తాగేస్తున్నారు. అయితే చాలామంది టీ బ్యాగ్స్ ని వాడి డస్ట్ బిన్ లో పడేస్తున్నారు. కానీ వాడేసిన టీ బ్యాగ్స్ ని పడేయకుండా వాటిని కూడా వాడుకుంటే అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి.

*టీ బ్యాగ్స్ ని మన ఇంటి పరిసరాలలో ఎక్కడైతే మొక్కలు పాతిపెట్టాలని అనుకుంటామో అక్కడ పాతిపెట్టాలి. అలా చేయడం వలన నేల సారవంతంగా మారుతుంది.
*టీ బ్యాగ్స్ ని కళ్ళు మంటలుగా ఉన్నప్పుడు కళ్ళ కింద, కాలిన గాయాల పైన కూడా పెట్టడం వలన మనకు నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది.
*నోటిలో ఏమైనా పుండ్లు ఉన్న వాటిపై టీ బ్యాగ్స్ ని ఉంచడం వలన నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది.
*శరీరంపై ఎక్కడైనా వాపు ఉన్నట్లైతే టీ బ్యాగ్స్ ని వాటిపై పెట్టడం వలన వాటిలో ఉండే యాంటీ బ్యాక్టీరియా వాపు తగ్గేలా చేస్తుంది.
*ఉల్లిపాయలు కోసినప్పుడు చాలాసేపటి వరకు మన చేతులు వాసన వస్తాయి. ఐతే టీ బ్యాగ్స్ ని మన చేతిలో కాసేపు పెట్టడం వలన ఉల్లిపాయ వాసన పోతుంది.
*మన ఇంటిలో ఎక్కడైనా చెడు వాసన వచ్చినట్లైతే ఆ వాసనని పోగొట్టడానికి టీ బ్యాగ్స్ ని ఆ ప్రదేశంలో పెట్టాలి. ఇలా చేయడం వలన చెడు వాసన అనేది పోతుంది.
*సూర్యుని నుండి వెలువడే కిరణాల వలన చర్మం కందిపోతే ఆ ప్లేస్ లో టీ బ్యాగ్స్ పెడితే చర్మం మళ్ళీ మామూలు స్థితికి వస్తుంది.
* గోరువెచ్చని నీటి బకెట్ లో టీ బ్యాగ్స్ వేసి ఉంచి దానిలో పాదాలు పెడితే పాదాలు మృదువుగా, చెడు వాసన రాకుండా ఉంటాయి.
*టీ బ్యాగ్స్ ని ఫ్రిడ్జ్ లో ఉంచితే అందులోని చేదు వాసనని పోయేలా చేస్తుంది.
*అలాగే టీ బ్యాగ్స్ లోని టీపొడి మన ఇంట్లో మొక్కలకి ఎరువుగా కూడా ఉపయోగపడుతుంది.