Waltair Veerayya : వాల్తేరు వీరయ్యలో రవితేజ, చిరుకి తమ్ముడు.. కోన వెంకట్!

మెగాస్టార్ చిరంజీవి వింటేజ్ లుక్ లో దర్శనమిస్తూ చేస్తున్న సినిమా 'వాల్తేరు వీరయ్య'. కాగా ఈ చిత్రంలో మాస్ మహారాజ్ రవితేజ కూడా ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రమోషన్స్ లో ఈ మూవీ రైటర్ కోన వెంకట్.. సినిమా గురించి ఒక ఆశక్తికర విషయాన్ని బయటపెట్టాడు.

Kaburulu

Kaburulu Desk

January 8, 2023 | 06:43 PM

Waltair Veerayya : వాల్తేరు వీరయ్యలో రవితేజ, చిరుకి తమ్ముడు.. కోన వెంకట్!

Waltair Veerayya : మెగాస్టార్ చిరంజీవి వింటేజ్ లుక్ లో దర్శనమిస్తూ చేస్తున్న సినిమా ‘వాల్తేరు వీరయ్య’. దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో చిరు.. జాలరిగా, డ్రగ్స్ స్మగ్లర్ గా రెండు డిఫరెంట్ పాత్రలో కనిపించబోతున్నాడు. నిన్న విడుదల చేసిన థియేట్రికల్ ట్రైలర్ యూట్యూబ్ ని షేక్ చేస్తుంది. సినిమా విడుదలకు ముందే దర్శకుడు ట్రైలర్ తో అభిమానులకు పూనకాలు తెప్పించాడు. ఇక ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈరోజు వైజాగ్ లో ఘనంగా జరగబోతుంది.

Waltair Veerayya : వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి శృతిహాసన్ దూరం.. ఎందుకు?

కాగా ఈ చిత్రంలో మాస్ మహారాజ్ రవితేజ కూడా ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రమోషన్స్ లో ఈ మూవీ రైటర్ కోన వెంకట్.. సినిమా గురించి ఒక ఆశక్తికర విషయాన్ని బయటపెట్టాడు. ఈ చిత్రంలో రవితేజ పాత్ర దాదాపు 40 నిముషాలు పాటు ఉండనుంది అంటూ తెలియజేశాడు. ఆ తరువాత విలేకరి.. ‘రవితేజ, చిరంజీవి అన్నదమ్ములు అని బయట టాక్ వినిపిస్తుంది. అది నిజమేనా?’ అని క్యూస్షన్ చేశాడు.

దీనికి కోన వెంకట్.. ‘ఇద్దరి మధ్య సమస్య ఉంటుంది. దాని కోసం ఇద్దరు ఒకరి పైకి ఒకరు సై అంటే సై అంటుంటారు. ఇక రవితేజ, చిరుకి తమ్ముడు.. అని మీరు అనుకుంటే నిజం అవుతుంది, కాదు అనుకుంటే అబద్ధం అవుతుంది’ అంటూ బదులిచ్చాడు. కోన వెంకట్ మాటలుబట్టి ఈ చిత్రంలో వీరిద్దరూ అన్నదమ్ములు గానే కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. మరి చూడాలి ఏది నిజం అనేది. కాగా ఈ మూవీలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది. జనవరి 13న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.