Waltair Veerayya : వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి శృతిహాసన్ దూరం.. ఎందుకు?

మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజ్ రవితేజ కలిసి నటిస్తున్న తాజా చిత్ర 'వాల్తేరు వీరయ్య'. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇవాళ విశాఖపట్నంలో ఘనంగా జరగనుంది. అయితే ఈ ఈవెంట్ కి వాల్తేరు వీరయ్య హీరోయిన్ శృతిహాసన్ మాత్రం దూరంగా ఉంటుంది. అసలు విషయం ఏంటంటే..

Kaburulu

Kaburulu Desk

January 8, 2023 | 04:55 PM

Waltair Veerayya : వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి శృతిహాసన్ దూరం.. ఎందుకు?

Waltair Veerayya : మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజ్ రవితేజ కలిసి నటిస్తున్న తాజా చిత్ర ‘వాల్తేరు వీరయ్య’. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇవాళ విశాఖపట్నంలో ఘనంగా జరగనుంది. కాగా ఈ ఈవెంట్ వేదిక ఆర్‌కే బీచ్‌లోనా, ఆంధ్రా యూనివర్సిటీలోనా అనే విషయం పై నిన్న రాత్రి వరకు కన్‌ఫ్యూషన్ నెలకుంది. చివరికి ఈ కార్యక్రమాన్ని వైజాగ్ లోనే ఆంధ్రా యూనివర్సిటీలో ఫిక్స్ చేశారు. ఇక ఈ ఈవెంట్ లో పాల్గొనేందుకు చిరంజీవి, రవితేజ ఇవాళ మధ్యాహ్నం విశాఖపట్నం బయలుదేరారు.

Waltair Veerayya Trailer : మెగా మాస్ జాతర.. అదిరిపోయిన వాల్తేరు వీరయ్య ట్రైలర్..

అయితే ఈ ఈవెంట్ కి వాల్తేరు వీరయ్య హీరోయిన్ శృతిహాసన్ మాత్రం దూరంగా ఉంటుంది. బాలయ్య వీరసింహారెడ్డి సినిమాలో కూడా శృతినే హీరోయిన్ గా నటించింది. ఇటీవల జరిగిన ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో శృతిహాసన్ హాజరయ్యి డాన్స్ వేసి మరి సందడి చేసింది. కానీ ఇప్పుడు వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మాత్రం డుమ్మా కొట్టేసింది. అసలు విషయం ఏంటంటే ఈ అమ్మడికి ఆరోగ్యం బాగోలేదట. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలియజేసింది.

‘అనారోగ్యంగా ఉండడంతో వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రాలేకపోతున్నా. నాకు చాలా బాధగా ఉంది రాలేకపోతున్నందుకు. చిరంజీవి గారితో పని చేయడం నా అదృష్టం. మొత్తం టీంకి నా అభినందనలు’ అంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీ పెట్టింది. కాగా ఈ మూవీ ట్రైలర్ ని నిన్న విడుదల చేశారు మేకర్స్. ఒకప్పటి చిరంజీవిని చూపించడంలో దర్శకుడు బాబీ చాలా కష్టపడ్డాడు. ఈ సినిమాలో చిరు.. జాలరిగా, డ్రగ్స్ స్మగ్లర్ గా రెండు వైవిధ్యమైన పాత్రలో కనిపించబోతున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.