PaniPuri : పానీ పూరీ రోజూ తినడం వలన కలిగే నష్టాలు ఏంటో తెలుసా??

Kaburulu

Kaburulu Desk

December 8, 2022 | 06:30 PM

PaniPuri : పానీ పూరీ రోజూ తినడం వలన కలిగే నష్టాలు ఏంటో తెలుసా??

PaniPuri :  పానీపూరీ అనగానే అందరూ చాలా ఇష్టంగా తింటూ ఉంటారు కానీ అది నెలలో రెండు మూడు సార్లు అయితే బాగానే ఉంటుంది. కానీ ఈ మధ్యకాలంలో అందరూ రోజూ పానీపూరీ తినడానికి ఇష్టపడుతున్నారు. రోజూ తినడం వలన మనం ఆరోగ్యానికి సంబందించిన ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది.

పానీపూరి తినడం వల్ల అనేక రకాల వ్యాధులు వస్తాయి..

* పానీపూరీలో ఉపయోగించే నీరు కలుషితమైతే టైఫాయిడ్ రావచ్చు. పిల్లలకైతే కడుపులో నొప్పి, కడుపులో మంట కూడా వస్తుంది.
* పానీపూరీలో ఉప్పు అనేది అధిక మోతాదులో ఉంటుంది కాబట్టి దీనిని రోజూ తింటే రక్తపోటు వచ్చే ప్రమాదం ఉంది.
* పానీపూరీని రోజూ తింటే జీర్ణ వ్యవస్థలో కూడా సమస్యలు వస్తాయి ఇంకా గ్యాస్, మలబద్దకం వంటి సమస్యలు కూడా రావచ్చు.
* పానీపూరీని తినడం వలన డీ హైడ్రేషన్ సమస్య కూడా వస్తుంది.
* పానీపూరీని ఎక్కువగా తినడం వలన వాంతులు, మోషన్స్, కామెర్లు వచ్చే అవకాశం ఉంది.
* పానీపూరీ తినడం వలన డయేరియా వచ్చే అవకాశం ఉంది.
* దీని వలన నోటిలో పుండ్లు, నోటి పూత వంటివి వచ్చే అవకాశం ఉంది.
* పానీపూరీలో కలిపే మషాలా ఐటమ్స్ వల్ల పేగుల్లో మంటలు వస్తాయి.

Mental Stress : మానసిక ఒత్తిడిని ఇలా తగ్గించుకోండి..

కాబట్టి పానీపూరి ఎప్పుడో ఒకసారి అయితే పర్వాలేదు కానీ రోజూ తినకూడదు. ఏదయినా మితంగా ఉంటేనే మంచిది. పరిమితికి మించితే మనల్ని అనారోగ్యానికి గురి చేస్తుంది.