Garlic : వెల్లుల్లి తినడం వల్ల ఎంత లాభమో తెలుసా??

Kaburulu

Kaburulu Desk

December 8, 2022 | 06:41 PM

Garlic : వెల్లుల్లి తినడం వల్ల ఎంత లాభమో తెలుసా??

Garlic : వెల్లుల్లిపాయలను చాలా మంది ఎక్కువగా వాడరు. కానీ వెల్లుల్లిపాయలను కూడా రోజూ తినాలి. వెల్లుల్లి ముఖ్యంగా చలికాలంలో రోజూ తిన్నట్లైతే ఈ కాలంలో వచ్చే జలుబు, దగ్గు వంటివి మనకు రాకుండా జాగ్రత్తపడవచ్చు. చిన్నపిల్లలు ఘాటుగా ఉందని లేదా వాసన బాగా వస్తుందని ఎక్కువగా తినరు కానీ వారి చేత కూడా రోజుకు కనీసం రెండు వెల్లుల్లిపాయలను ఏదో ఒక రూపంలో తినేలా చేయాలి.

వెల్లుల్లిపాయలను రోజూ రెండు తింటే షుగర్ ఉన్నవారికి అది కంట్రోల్లో ఉంటుంది. అలాగే వెల్లుల్లిపాయలు మన శరీరానికి రోగనిరోధకశక్తిని పెంచుతాయి. ఆస్తమా ఉన్నవారికి కూడా ఇది ఎంతగానో ఆరోగ్యపరంగా ఉపయోగపడుతుంది. గొంతు నొప్పిని తగ్గించడానికి కూడా ఇది సహాయపడుతుంది. వెల్లుల్లిపాయలు మన శరీరంలో రక్త సరఫరా బాగా జరిగి రక్తపోటు కంట్రోల్లో ఉండేలా చేస్తుంది.

PaniPuri : పానీ పూరీ రోజూ తినడం వలన కలిగే నష్టాలు ఏంటో తెలుసా??

వెల్లుల్లిపాయలను మనం రోజూ భోజనం తినేటప్పుడు వేడి వేడి అన్నంలో రెండు రెబ్బలను మెత్తగా చేసి కలుపుకొని తినాలి. ఉదయాన్నే తినాలనుకుంటే పరకడుపున రెండు పాయలను తేనెలో నానబెట్టుకొని తినాలి. లేదా మరిగే పాలల్లో కొద్దిగా దంచిన వెల్లుల్లిపాయలను వేసుకొని వడగట్టి పాలను తాగాలి. అలాగే వెల్లుల్లిని బాగా దంచి కొద్దిగా నూనెలో వేపి కారం, ఉప్పు చల్లుకొని అన్నంలో కలుపుకొని తింటే కూడా మంచిదే. ఈ విధంగా వెల్లుల్లిపాయలను మనం రోజూ తినే ఆహారంలో భాగంగా చేసుకొని సీజనల్ ఎఫెక్ట్స్ నుండి మనల్ని మనం కాపాడుకోవచ్చు.