Prabhas : రేపటి నుండి మొదలుకానున్న ‘ప్రభాస్-మారుతీ’ సినిమా షెడ్యూల్..

Kaburulu

Kaburulu Desk

December 8, 2022 | 12:34 PM

Prabhas : రేపటి నుండి మొదలుకానున్న ‘ప్రభాస్-మారుతీ’ సినిమా షెడ్యూల్..

Prabhas : పాన్ ఇండియా హీరో ప్రభాస్, దర్శకుడు మారుతీ కలయికలో ఒక సినిమా రాబోతున్నట్లు ప్రకటించినా, అధికారికంగా మాత్రం లాంచ్ కాలేదు. కానీ ఈ సినిమా గురించి రోజుకో వార్త ఇండస్ట్రీలో వినిపిస్తుంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోన్న ఈ భారీ బడ్జెట్ చిత్రం హారర్ కామెడీ నేపథ్యంతో తెరకెక్కబోతుంది.

Prabhas : బాహుబలితో అమిత్ షా భేటీ.. ఇందుకేనా..

ఇక ఈ సినిమా మొదటి షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తీ చేసుకొంది అంటూ సినీవర్గాల్లో గట్టిగానే వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా చిత్ర యూనిట్ ఈ మూవీ సెకండ్ షెడ్యూల్ రేపటి నుండి మొదలు పెట్టనున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా కథ దాదాపు ఒక పాత థియేటర్లో జరగనుంది అంటా. అందుకోసం మారుతీ సుమారు రూ.10 కోట్లు ఖర్చు పెట్టి ఒక థియేటర్ సెట్ ని నిర్మిచాడట.

ఈ మూవీలో హీరోయిన్లుగా మాళవిక మోహన్, నిధి అగర్వాల్, రిధి కుమార్ నటిస్తున్నారు. ఈ షెడ్యూల్ లో ప్రభాస్ తో పాటు హీరోయిన్లు కూడా పాల్గొనున్నారు. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తీ చేసుకొనేలా దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట. అయితే ఈ వార్తలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా ప్రస్తుతం ప్రభాస్.. సలార్, ప్రాజెక్ట్-K చిత్రాల్లో నటిస్తున్నాడు.