Mental Stress : మానసిక ఒత్తిడిని ఇలా తగ్గించుకోండి..

Kaburulu

Kaburulu Desk

December 7, 2022 | 06:11 PM

Mental Stress : మానసిక ఒత్తిడిని ఇలా తగ్గించుకోండి..

Mental Stress :  ఈ రోజుల్లో కొంతమంది మానసిక ఒత్తిడికి ఎక్కువగా గురవుతున్నారు. ఎక్కువగా ఒక దాని మీద ఆలోచించడం, దేని గురించి అయినా ఎక్కువగా భాద పడడం వంటివి చేస్తూ ఉంటే మానసికంగా ఒత్తిడికి గురవుతారు. మానసిక ఒత్తిడి ఉన్నట్లైతే దానిని తగ్గించుకోవాలి లేకపోతే తీవ్రమైన అనారోగ్య పరిస్థితులను ఎదురుకోవలసి ఉంటుంది. మానసిక ఒత్తిడి వలన రక్తపోటు పెరుగుతుంది. గుండెపోటు సంభవించే ప్రమాదం కూడా ఉంది.

మనిషికి రోజుకు ఏడు లేదా ఎనిమిది గంటల నిద్ర అవసరం. నిద్ర తక్కువైనా కూడా మన కళ్ళు, శరీరం బాగా అలసిపోయి మానసికంగా ఒత్తిడికి గురవుతారు. మానసిక ఒత్తిడి నుండి రిలాక్స్ అవడానికి గట్టిగా శ్వాస తీసుకొని వదలాలి ఇలా నాలుగు లేదా ఐదు సార్లు చేయాలి. మెట్లు ఎక్కడం, దిగడం వంటివి చేయాలి ఇలా చేయలేకపోతే వాకింగ్ చేయాలి.

Brushing : మెరవాలని పళ్ళని గట్టిగా బ్రష్ చేస్తున్నారా..? అయితే ఇబ్బందులు తప్పవు..

మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి సెలవు రోజుల్లో మన ఫ్యామిలీతో లేదా ఫ్రెండ్స్ తో గాని టైం స్పెండ్ చేయాలి అప్పుడు మానసికంగా ఉత్సాహంగా తయారవుతారు. కొంతమంది ఎవ్వరితోనూ ఎక్కువగా మాట్లాడరు అలాంటివారు మానసికంగా ఒత్తిడిని తగ్గించుకోవడానికి సోషల్ నెట్వర్కింగ్ ని పెంచుకోవాలి. ఇంకా ఫ్రెండ్స్ ను, పరిచయస్తులను కలవడం, వారితో మాట్లాడడం వంటివి చేస్తూ ఉండాలి. అలాగే మనసులో ఉన్న బాధని బాగా క్లోజ్ గా ఉండేవాళ్ళతో షేర్ చేసుకోవాలి. ఇలా మానసికంగా ఒత్తిడికి దూరం కావచ్చు.