Rashmika Mandanna : ట్రోల్స్, రూమర్స్ పై సీరియస్ గా స్పందించిన రష్మిక మందన్నా..

Kaburulu

Kaburulu Desk

November 10, 2022 | 08:15 AM

Rashmika Mandanna : ట్రోల్స్, రూమర్స్ పై సీరియస్ గా స్పందించిన రష్మిక మందన్నా..

Rashmika Mandanna :  ఇటీవల సోషల్ మీడియాలో పలువురు సెలబ్రిటీలపై రూమర్స్, ట్రోల్స్, నెగిటివిటీ చాలా ఎక్కువైపోయాయి. కొంతమంది వీటిని చూసి చూడనట్టు వదిలేస్తుంటే మరికొంతమంది వీటిపై సీరియస్ అవుతున్నారు. ఇంకొంతమంది వీటికి క్లారిటీ ఇస్తున్నారు. తాజాగా రష్మిక మందన్నా తనపై వచ్చే ట్రోల్స్, రూమర్స్, నెగిటివిటీపై స్పందిస్తూ సీరియస్ అయి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది.

రష్మిక ఈ పోస్ట్ లో.. ”నేను హీరోయిన్ అయిన దగ్గర్నుంచి ఇలాంటి ట్రోల్స్, నెగిటివిటీ చూస్తూనే ఉన్నాను. ఒక్కోసారి అవి నన్ను చాలా బాధపెడుతున్నాయి. నేను ఎంచుకున్న కెరీర్ అలాంటిది. మాపై చాలా మంది కామెంట్స్ చేస్తారు. అలా అని నాపై ఇష్టమొచ్చినట్టు మాట్లాడమని కాదు. నా పని విషయంలో లేదా నేను ఏదయినా తప్పు చేస్తే ఆ విమర్శలని నేను తీసుకుంటాను. నేను మాట్లాడని విషయాలలో కూడా నన్ను ఇన్వాల్స్ చేసి మాట్లాడుతున్నారు. నేను కొన్ని ఇంటర్వ్యూలలో మాట్లాడిన అంశాలని ముక్కలు ముక్కలుగా కట్ చేసి నాపై నెగిటివిటీని పెంచుతున్నారు. ఇలా నాపై మీరు రాసే తప్పుడు వార్తలు, ట్రోల్స్, రూమర్స్ నాకే కాదు, నా ఫ్యామిలీకి, నా సన్నిహితులకు బాధని కలిగిస్తున్నాయి. ఇలాంటి వాటిని అసలు పట్టించుకోకూడదు అనుకున్నాను. కానీ ఇప్పుడు మరీ దిగజారి కామెంట్స్ చేస్తున్నారు. అందుకే ఇలా పోస్ట్ చేస్తున్నాను” అని తెలిపింది.

Vivek Ranjan Agnihotri : కశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్.. ఈసారి ‘వ్యాక్సిన్ వార్’ అంటున్నాడు.. స్వతంత్ర దినోత్సవం టార్గెట్..

దీంతో తనపై వచ్చే ట్రోల్స్, రూమర్స్, నెగిటివిటీపై రష్మిక స్పందిస్తూ చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.