Varisu : కంప్లీట్ ఫ్యామిలీ ఎమోషన్స్‌తో ‘వారసుడు’ ట్రైలర్..
తమిళ హీరో విజయ్ నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం 'వరిసు'. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తెలుగులో 'వారసుడు' టైటిల్ తో రిలీజ్ కానుంది. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు భారీ తారాగణంతో ప్రతిష్టాత్మకంగా ఈ మూవీని నిర్మిస్తున్నాడు. ఇక సినిమా తమిళ, తెలుగు ట్రైలర్స్ ని నేడు విడుదల చేశారు మేకర్స్. ట్రైలర్‌కి మాస్ టచ్ ఇస్తూ క్లాస్‌గా కట్ చేశాడు దర్శకుడు.

Varisu : తమిళ హీరో విజయ్ నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం ‘వరిసు’. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తెలుగులో ‘వారసుడు’ టైటిల్ తో రిలీజ్ కానుంది. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు భారీ తారాగణంతో ప్రతిష్టాత్మకంగా ఈ మూవీని నిర్మిస్తున్నాడు. ఇక సినిమా తమిళ, తెలుగు ట్రైలర్స్ ని నేడు విడుదల చేశారు మేకర్స్. ట్రైలర్‌కి మాస్ టచ్ ఇస్తూ క్లాస్‌గా కట్ చేశాడు దర్శకుడు.
Vijay : స్టేజీపై ‘రంజితమే’ పాట పాడి అదరగొట్టిన విజయ్..
జయసుధ, శరత్ కుమార్ విజయ్ కి అమ్మానాన్నలుగా నటిస్తున్నారు. శ్రీకాంత్ అండ్ శామ్ అన్నయ్యలుగా నటిస్తున్నారు. కుటుంబం అంటే బంధం, బాంధవ్యాలు అనుకునే తల్లి కళ్ళ ముందే కుటుంబం ముక్కలు అయ్యిపోతుంటే.. దేశం మొత్తాన్ని తిరుగుతూ లైఫ్ ని ఎంజాయ్ చేసే హీరో ఆ ఫ్యామిలీ విడిపోకుండా ఎలా చూసుకున్నాడు అనేదే మెయిన్ స్టోరీ లైన్.
అయితే ఇటువంటి సినిమాలు ఇంతకుముందు తెలుగుతెరపై చాలానే వచ్చాయి. కాకపోతే ఈ ఫ్యామిలీ కథకి కొంచెం కమర్షియల్ టచ్ ఇచ్చాడు దర్శకుడు. మరి ఈ కథ ఆడియన్స్ ని ఎంతవరకు అలరిస్తుందో అనేది చూడాల్సిందే. కాగా ఈ మూవీలో హీరోయిన్ గా రష్మిక మందన నటిస్తుంది. ప్రకాష్ రాజ్ విలన్ గా నటిస్తుండగా సంగీత, కుష్బూ, ప్రభు, యోగిబాబు తదితరులు ప్రధాన పత్రాలు పోషించారు. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.