Rashmika Mandanna : నీ బాయ్ ఫ్రెండ్‌ని పంపించినట్లే నిన్ను కూడా పంపిచేస్తాం.. రష్మికపై బాలీవుడ్ క్రిటిక్ ట్వీట్..

నేషనల్ క్రష్ రష్మిక మందన నటించిన బాలీవుడ్ చిత్రం 'మిషన్ మజ్ను' విడుదలకు సిద్దమవుతుంది. ఈ క్రమంలో బాలీవుడ్ వరుస ప్రమోషన్ లు చేస్తూ సందడి చేస్తున్న ఈ భామపై ప్రముఖ బాలీవుడ్ క్రిటిక్ KRK సంచలన ట్వీట్ చేశాడు.

Kaburulu

Kaburulu Desk

January 11, 2023 | 11:47 AM

Rashmika Mandanna : నీ బాయ్ ఫ్రెండ్‌ని పంపించినట్లే నిన్ను కూడా పంపిచేస్తాం.. రష్మికపై బాలీవుడ్ క్రిటిక్ ట్వీట్..

Rashmika Mandanna : నేషనల్ క్రష్ రష్మిక మందన సౌత్ లో సూపర్ స్టార్ డమ్ సంపాదించుకుంది. ఇప్పుడు నార్త్ లోను పాగా వేసేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఇటీవలే ఈ అమ్మడు అమితాబ్ బచ్చన్ తో కలిసి ‘గుడ్ బై’ సినిమాలో నటించి బాలీవుడ్ డెబ్యూట్ ఇచ్చింది. కానీ అది ఆశించిన అంతా విజయం సాదించ లేకపోయింది. దీంతో రష్మిక ఆశలు అన్ని ‘మిషన్ మజ్ను’ సినిమా పైనే పెట్టుకుంది. సిద్దార్థ్ మల్హోత్రా ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.

Vijay Devarakonda : లైగర్ పోయినా విజయ్ దేవరకొండకి బాలీవుడ్ నుంచి ఆఫర్లు..??

స్పై యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం థియేటర్ లో గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది అనుకుంటే ఓటిటి విడుదలకు సిద్దమయ్యి రష్మికకి గట్టి షాక్ ఇచ్చింది. ఈ నెల 20న నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ కానుంది. సరే ఏదైనా ఏముంది బాలీవుడ్ సినిమానే కదా అని, మూవీని ఒక రేంజ్ లో ప్రమోట్ చేయడం మొదలు పెట్టింది. ఇక బాలీవుడ్ లో ఈ భామ సందడి చూసి ప్రముఖ బాలీవుడ్ క్రిటిక్ KRK ఆమె పై సంచలన ట్వీట్ చేశాడు.

‘మేడం రష్మిక, మా హిందీ ఆడియన్స్ మీ బాయ్ ఫ్రెండ్ అనకొండ ‘లైగర్’ సినిమాని ఏమి చేసారో మీకు తెలుసు. ఇప్పుడు మిమ్మల్ని కూడా మీ బాయ్ ఫ్రెండ్ ని పంపించినట్లే పంపిచేస్తాం. అయితే మిమ్మల్ని భోజ్‌పురి సినిమాల్లో చూడటం మాకు సంతోషంగా ఉంది’ అంటూ ట్వీట్ చేశాడు.

అలాగే మరో ట్వీట్ లో.. ‘రష్మికని నేషనల్ క్రష్ అని పిలిచే వారంతా ఒకసారి డాక్టర్ దగ్గరకి వెళ్లి ఐ చెకప్ చేయించుకోండి. రష్మిక.. రవికిషన్, కేసరి లాల్, పవన్ సింగ్ లాంటి వాళ్ళతో వర్క్ చేస్తే ఇంకా బాగా రాణించగలదు’ అంటూ లుక్ గురించి డీగ్రేడ్ చేస్తూ మాట్లాడాడు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.