Vijay Devarakonda : లైగర్ పోయినా విజయ్ దేవరకొండకి బాలీవుడ్ నుంచి ఆఫర్లు..??

Kaburulu

Kaburulu Desk

November 4, 2022 | 10:47 AM

Vijay Devarakonda : లైగర్ పోయినా విజయ్ దేవరకొండకి బాలీవుడ్ నుంచి ఆఫర్లు..??

Vijay Devarakonda  :  ఇటీవల విజయ్ దేవరకొండ లైగర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. ఆగస్టులో ఈ సినిమా రిలీజయింది. భారీ అంచనాల మధ్య పాన్ ఇండియా సినిమాగా రిలీజయిన లైగర్ భారీ పరాజయాన్ని మూటకట్టుకుంది. సినిమా ముందు ఓవర్ హైప్ ఇచ్చాడు విజయ్. సినిమా ఫ్లాప్ అయ్యాక అసలు కనపడకుండా పోయాడు. అయితే లైగర్ కి ముందు విజయ్ చేతిలో దాదాపు నాలుగు ప్రాజెక్టులు ఉన్నాయి అన్నారు.

లైగర్ సినిమా పోవడంతో పూరి కాంబోలో రావాల్సిన జనగణమన ఆగిపోయింది. సుకుమార్ సినిమా కూడా చెప్పలేని పరిస్థితిలో ఉంది. గౌతమ్ తిన్ననూరితో సినిమా ఉందని వార్తలు వచ్చినా అందులో నిజం లేదు. ప్రస్తుతానికి విజయ్, సమంత జంటగా నటిస్తున్న ఖుషి చిత్రీకరణలో ఉంది. ఈ సినిమా ఒక్కటే విజయ్ చేతిలో ఉన్నట్టు సమాచారం. అయితే తాజాగా విజయ్ కి బాలీవుడ్ నుంచి ఆఫర్స్ వస్తున్నట్టు తెలుస్తోంది.

HIT 2 : అడివిశేష్ ‘హిట్ సెకండ్ కేస్’ టీజర్ రిలీజ్..

లైగర్ సినిమా పోయినా విజయ్ దేవరకొండ బాలీవుడ్ మీద మంచి ఇంపాక్ట్ ని చూపించాడు. బాలీవుడ్ లో చాలామంది విజయ్ తో సినిమాలు తీయడానికి ఆసక్తి చూపుతున్నారట. బాలీవుడ్ మీడియా సమాచారం ప్రకారం కరణ్ జోహార్ బ్యానర్ లో ఒక సినిమా, షారుఖ్ ఖాన్ కి సంబంధించిన రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్స్ ఒక సినిమా చర్చల్లో ఉన్నట్టు సమాచారం.