Rashmika Mandanna : కొరియన్, థాయ్‌లాండ్ స్టార్స్‌తో ఇటలీలో సందడి చేస్తున్న రష్మిక..

తాజాగా రష్మిక ఇటలీలో జరుగుతున్న మిలాన్ ఫ్యాషన్ వీక్ కి వెళ్ళింది. ఈ ఫ్యాషన్ వీక్ లో రష్మిక పాల్గొని రకరకాల ఫోజులతో, కొత్త కొత్త డ్రెస్సులతో హడావిడి చేస్తుంది. అయితే ఈ ఫ్యాషన్ వీక్ కి పలు దేశాల నుంచి అనేకమంది సెలబ్రిటీలు వస్తారు. అలాగే కొరియన్ కి చెందిన................

Kaburulu

Kaburulu Desk

February 24, 2023 | 04:07 PM

Rashmika Mandanna : కొరియన్, థాయ్‌లాండ్ స్టార్స్‌తో ఇటలీలో సందడి చేస్తున్న రష్మిక..

Rashmika Mandanna :  నేషనల్ క్రష్ రష్మిక ప్రస్తుతం తెలుగు, తమిళ్, హిందీ సినిమాలతో వరుసగా బిజీగా ఉంది. ఇటీవలే సంక్రాంతికి వారసుడు సినిమాతో తెలుగు, తమిళ ప్రేక్షకులని పలకరించింది. ఆ ఆతర్వాత మిస్టర్ మజ్ను సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకులని పలకరించింది. ప్రస్తుతం బాలీవుడ్ యానిమల్ సినిమా షూట్ తో బిజీగా ఉంది రష్మిక. ఇక సోషల్ మీడియాలో, యాడ్స్ తో రెగ్యులర్ గా హడావిడి చేస్తుంది.

తాజాగా రష్మిక ఇటలీలో జరుగుతున్న మిలాన్ ఫ్యాషన్ వీక్ కి వెళ్ళింది. ఈ ఫ్యాషన్ వీక్ లో రష్మిక పాల్గొని రకరకాల ఫోజులతో, కొత్త కొత్త డ్రెస్సులతో హడావిడి చేస్తుంది. అయితే ఈ ఫ్యాషన్ వీక్ కి పలు దేశాల నుంచి అనేకమంది సెలబ్రిటీలు వస్తారు. అలాగే కొరియన్ కి చెందిన పలువురు నటులు వచ్చారు. దీంతో రష్మిక అక్కడకు వచ్చిన ఫేమస్ సౌత్ కొరియన్ నటుడు జంగ్‌ ఊ, థాయ్‌లాండ్‌కు చెందిన నటుడు గల్ఫ్‌ కానావుత్‌తో కలిసి సందడి చేసింది.

Rakesh-Sujatha : పెళ్లితో ఒక్కటైన జబర్దస్త్ ప్రేమ జంట..

ఈ ఇద్దరితో రష్మిక కలిసి ఫొటోలకు, వీడియోలకు ఫోజులిచ్చింది. ఇటీవల మన దేశంలో కూడా కొరియన్ సినిమాలకు మంచి ఆదరణ లభిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఆ నటుడు గురించి తెలిసిన ప్రేక్షకులు, రష్మిక అభిమానులు ఆ ఫోటోలని షేర్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. ఈ ఫొటోలో రష్మిక వైట్ షర్ట్, ప్యాంటు వేసుకొని వెరైటీగా జడ వేసుకొని కొరియన్ లవ్ సింబల్ చూపిస్తూ ఫోజులిచ్చింది. రష్మిక, జంగ్‌ ఊ, గల్ఫ్‌ కానావుత్‌ కలిసి దిగిన ఫోటో ప్రస్తుతం వైరల్ గా మారింది.