Rashmika Mandanna : ట్రోల్స్ పై మరోసారి స్పందించిన రష్మిక.. నా ఫ్యామిలీని అంటే ఊరుకోను..

రష్మిక పై కూడా చాలా ట్రోల్స్ వస్తుంటాయి. అప్పుడప్పుడు రష్మిక ఈ ట్రోల్స్ తో కూడా ట్రెండింగ్ లో ఉంది. కొన్ని రోజుల క్రితమే ఓ వివాదంతో బాగా ట్రోల్ అయింది రష్మిక. తాజాగా............

Kaburulu

Kaburulu Desk

January 19, 2023 | 02:13 PM

Rashmika Mandanna : ట్రోల్స్ పై మరోసారి స్పందించిన రష్మిక.. నా ఫ్యామిలీని అంటే ఊరుకోను..

Rashmika Mandanna :  నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఇటీవలే సంక్రాంతికి తమిళ్ లో విజయ్ సరసన వరిసు సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ సినిమా తెలుగులో వారసుడుగా రిలీజయింది. అలాగే బాలీవుడ్ లో జనవరి 20న సిద్దార్థ్ మల్హోత్రా సరసన మిషన్ మజ్ను సినిమాతో రాబోతుంది. గత కొన్ని రోజులుగా ఈ సినిమాల ప్రమోషన్స్ తో బిజీగా ఉన్న రష్మిక తాజాగా ఓ తెలుగు యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది.

రష్మిక ఇచ్చిన ఈ ఇంటర్వ్యూలో అనేక విషయాలపై మాట్లాడింది. సినీ పరిశ్రమలో హీరోలు, హీరోయిన్స్, సినిమా వాళ్ళని ట్రోల్ చేస్తారన్న సంగతి తెలిసిందే. రష్మిక పై కూడా చాలా ట్రోల్స్ వస్తుంటాయి. అప్పుడప్పుడు రష్మిక ఈ ట్రోల్స్ తో కూడా ట్రెండింగ్ లో ఉంది. కొన్ని రోజుల క్రితమే ఓ వివాదంతో బాగా ట్రోల్ అయింది రష్మిక. తాజాగా ఇచ్చిన ఈ ఇంటర్వ్యూలో ట్రోల్స్ పై మాట్లాడుతూ రష్మిక సీరియస్ అయింది.

Sannidhanam PO : శబరిమల నేపథ్యంలో సినిమా.. శబరిమల అయ్యప్ప సన్నిధానంలో ప్రారంభం..

రష్మిక మాట్లాడుతూ.. నేను చాలా వరకు సైలెంట్ గానే ఉంటాను. కెరీర్ మొదట్లోనే నాపై ట్రోలింగ్ వచ్చింది. అప్పట్నుంచి కూడా నేను ట్రోలింగ్ ని పట్టించుకోలేదు ఎందుకంటే నాకు ప్రేక్షకులపై గౌరవం ఉంది. నా మీద విమర్శలు చేస్తారు, ఫేక్ వార్తలు రాస్తారు, ట్రోల్ చేస్తారు. ఇవేమి నన్ను ఇబ్బందిపెట్టావు, బాధపెట్టావు. అసలు వీటిని నేను పట్టించుకోను. కానీ కొంతమంది శృతిమించి నా కుటుంబాన్ని, నా చెల్లిని ఇబ్బంది పెడుతున్నారు. అందుకే నేను వాటిని తీసుకోలేకపోతున్నాను. నా చెల్లి మానసిక ఆరోగ్యం వీటివల్ల దెబ్బతినకూడదు. తనని జాగ్రత్తగా నేను చూసుకోవాలి. అందుకే నా మీద ట్రోల్స్ వచ్చినా పట్టించుకోను కానీ నా ఫ్యామిలీ, చెల్లి మీద మాత్రం ట్రోల్స్ వస్తే ఊరుకోను, కచ్చితంగా సీరియస్ గా రియాక్ట్ అవుతాను అంటూ ట్రోల్స్ పై మరోసారి సీరియస్ అయింది. దీంతో రష్మిక సీరియస్ గా మాట్లాడిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.