Varasudu Review : వారసుడు.. తెలుగు సినిమాలని కలిపి తమిళ వాళ్లకి ఫ్యామిలీ ఎంటర్టైనర్‌ని అందించిన వంశీ..

తమిళ స్టార్ హీరో విజయ్ హీరోగా, రష్మిక మందన్న హీరోయిన్ గా తెలుగు డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన సినిమా వారసుడు. తమిళ్ లో వరిసుగా తెరకెక్కి తెలుగులో వారసుడుగా రిలీజయింది. తమిళ్ లో...............

Kaburulu

Kaburulu Desk

January 16, 2023 | 03:37 PM

Varasudu Review : వారసుడు.. తెలుగు సినిమాలని కలిపి తమిళ వాళ్లకి ఫ్యామిలీ ఎంటర్టైనర్‌ని అందించిన వంశీ..

Varasudu Review :  తమిళ స్టార్ హీరో విజయ్ హీరోగా, రష్మిక మందన్న హీరోయిన్ గా తెలుగు డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన సినిమా వారసుడు. తమిళ్ లో వరిసుగా తెరకెక్కి తెలుగులో వారసుడుగా రిలీజయింది. తమిళ్ లో జనవరి 11నే రిలీజయినా తెలుగులో మాత్రం 14న రిలీజయింది. తమిళ్ లో ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని విజయం సాధించింది. ఇక్కడ తెలుగులో మాత్రం ఈ సినిమాకి అనుకున్నంత ఆదరణ రాలేదు. తెలుగు స్టార్ హీరోలు బాలకృష్ణ, చిరంజీవి సినిమాలు ఉండటంతో ఈ సినిమాని ఆప్షనల్ గానే ఉంచారు తెలుగు ప్రేక్షకులు. తమిళ్ లో మంచి కలెక్షన్స్ వస్తున్నా తెలుగులో మాత్రం కలెక్షన్స్ అంత పెద్దగా లేవు.

ఇక కథ విషయానికి వస్తే.. ఒక డబ్బున్న జాయింట్ ఫ్యామిలీ. అందరూ బిజినెస్ లలో మునిగి తేలుతారు. కానీ చిన్న కొడుకు(విజయ్) మాత్రం చదువుకున్నా ఫ్యామిలీ బిజినెస్ వద్దని, జనాల కోసం అంటూ, సొంతంగా ఎదుగుతాను అంటూ చెప్పడంతో ఇంట్లోంచి బయటకి వెళ్లిపొమ్మంటాడు నాన్న. అమ్మ కోరిక మేరకు కొన్నేళ్ల తర్వాత ఇంటికి వస్తే అన్నయ్యలు చేసిన తప్పుల వల్ల ఫ్యామిలీ ముక్కలు ముక్కలు అవుతుంది. నాన్న చనిపోతాడని తెలిసి బిజినెస్ ని తీసుకొని ఎలా సక్సెస్ అయ్యాడు? విలన్ అన్నయ్యలని చేరదీసి హీరోకి రివర్స్ అయితే ఫ్యామిలీని ఎలా కలిపాడు అనేదే కథాంశం. కుటుంబం అంత కలిసి ఉండాలన్నదే కథ.

ఇలాంటి కథలు తెలుగులో చాలా వచ్చాయి. అలాగే కొన్ని సీన్స్ కూడా మన తెలుగు సినిమాల్లోంచి తీసుకున్నారు. తమిళ సినిమాగా చేయడం, విజయ్ ఇప్పటివరకు పూర్తి ఫ్యామిలీ సినిమా చేయకపోవడంతో ఈ సినిమాకి అక్కడ ఆదరణ లభించింది. అయితే ఇక్కడ చాలా ఫ్యామిలీ సినిమాలు చూస్తూనే ఉంటాము. వారసుడు సినిమా చూసిన తెలుగు ప్రేక్షకులకి గౌతమ్ SSC, అన్నయ్య సినిమాలు కలిపి చూసినట్టు ఉంటుంది. అక్కడక్కడా వేరే సినిమాల ఛాయలు కూడా కనిపిస్తాయి.

Tegimpu Review : కథ వేరైనా కథనం మనీహైస్ట్ సిరీస్.. క్రిమినల్ మంచి పని చేస్తే.. అజిత్ వన్ మ్యాన్ షో..

విజయ్ హీరోగా తన అన్ని సినిమాల లాగే మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినా డైరెక్టర్ వంశీ ఇంకా విజయ్ ని సరిగ్గా వాడుకోలేదని అనిపిస్తుంది. విజయ్ తో పాటు అన్నయ్యలుగా చేసిన శ్రీకాంత్ కి, శ్యామ్ కి కూడా సమాన పాత్రలు ఉన్నాయి. సంగీత తన పాత్రతో మెప్పిస్తుంది. ఇక రష్మిక కేవలం సాంగ్స్ కోసమే. రంజితమే సాంగ్ తప్ప మిగిలినవి ఏవి తెలుగు ప్రేక్షకులకి అర్ధం కావు. SJ సూర్య స్పెషల్ అప్పీరెన్స్ బాగుంటుంది. నాన్నగా శరత్ కుమార్, తల్లిగా జయసుధ చాలా బాగా చేశారు. విలన్ గా ప్రకాష్ రాజ్ షరా మాములే. అక్కడక్కడా హీరోని ఎలివేట్ చేసిన కొన్ని సీన్స్ మాత్రం బాగుంటాయి. మొత్తానికి వారసుడు తమిళ వాళ్ళకే. ఇలాంటి వారసుడులని తెలుగు వాళ్ళు చూస్తూనే ఉన్నారు. తమిళ్ లో మాత్రం పండక్కి మంచి విజయం సాధించి కలెక్షన్స్ కూడా కలెక్ట్ చేస్తుంది విజయ్ వరిసు.

నోట్ : ఇది మా అభిప్రాయం మాత్రమే..