Nagashaurya : పెళ్లిపీటలెక్కబోతున్న నాగశౌర్య.. పెళ్లి కూతురు ఎవరో తెలుసా??

Kaburulu

Kaburulu Desk

November 11, 2022 | 08:09 AM

Nagashaurya : పెళ్లిపీటలెక్కబోతున్న నాగశౌర్య.. పెళ్లి కూతురు ఎవరో తెలుసా??

Nagashaurya :  చందమామ కథలు, ఊహలు గుసగుసలాడే, ఛలో, వరుడు కావలెను.. లాంటి పలు సినిమాలతో తెలుగులో మంచి హీరోగా ఎదిగాడు నాగశౌర్య. ఇటీవలే కృష్ణ వ్రింద విహారి సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చి మెప్పించాడు నాగశౌర్య. తాజాగా ఈ యువ హీరో తన పెళ్లి కబురు చెప్పాడు. ఇటీవలే కొన్ని నెలల క్రితం తన అన్నయ్య పెళ్లి చేసుకోగా ఇప్పుడు శౌర్య కూడా పెళ్లి పీటలు ఎక్కుతున్నాడు.

ఈ మేరకు నాగ శౌర్య కుటుంబం అధికారికంగా తెలిపింది. బెంగుళూరుకి చెందిన ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్ అనూష శెట్టితో నాగశౌర్య వివాహం నవంబర్ 20న బెంగుళూరులో జరగనుంది. అనూష శెట్టి ఇండియాలోనే టాప్ ఇంటీరియర్ డిజైనర్స్ లో ఒకరు. ఇప్పటికే ఆమె పలు అవార్డులు, రివార్డులు అందుకుంది. ఆమెపై పలు మ్యాగజైన్స్ లో కూడా ఆర్టికల్స్ వచ్చాయి.

Rashmika Mandanna : ట్రోల్స్, రూమర్స్ పై సీరియస్ గా స్పందించిన రష్మిక మందన్నా..

నవంబర్ 20న అనూష శెట్టి, నాగశౌర్య ఒక్కటవ్వబోతున్నారు. ఈ వివాహానికి పలువురు ప్రముఖులు కూడా హాజరవ్వనున్నట్టు సమాచారం. అభిమానులు, పలువురు ప్రముఖులు వీరికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.